సిరులనిచ్చే శ్రీరంగనాయకుడు
తెలుగునాట వెలసిన అత్యంత ప్రాచీనమైన ... పరమ పవిత్రమైన రంగనాయకస్వామి క్షేత్రాల్లో 'ఏదులాబాద్' ఒకటి. రంగారెడ్డి జిల్లా 'ఘట్కేసర్' మండలంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఈ ప్రాంతానికి చెందిన విష్ణుభక్తుడు అప్పలదేశికా చార్యులు ఒకసారి 'శ్రీవిల్లిపుత్తూరు' క్షేత్రాన్ని దర్శించి ఆ రాత్రి అక్కడే నిద్రచేశాడు. కలలో అతనికి గోదాదేవి అమ్మవారు కనిపించి తన ప్రతిమ అతనికి కనిపిస్తుందనీ, దానిని వెంట తీసుకువెళ్లి అతని గ్రామంలో ప్రతిష్ఠించమని చెప్పింది.
మెలకువ వచ్చిన అతనికి అత్యద్భుతమైన గోదాదేవి అమ్మవారి విగ్రహం కనిపించింది. దాంతో ఆయన ఆ ప్రతిమను తీసుకుని వచ్చి 'రాయపురం' (ఏదులాబాద్ పూర్వనామం) లో చిన్న మందిరంలో ప్రతిష్ఠించాడు. ఆ తరువాత అమ్మవారు ఆ గ్రామంలోని కొందరు భక్తులకు కలలో కనిపించి రంగనాయక స్వామికి ఆలయం నిర్మించమని చెప్పింది. అందుకు అవసరమైన ఆర్ధిక సహాయం అప్పలదేశికా చార్యులకు అందజేయమని సూచించింది.
వాళ్లంతా అమ్మవారు చెప్పినట్టుగా చేయడంతో ప్రస్తుతమున్న ఆలయం నిర్మించబడింది. అలా వందల సంవత్సరాల క్రితమే ఈ ఆలయం వైభవాన్ని సంతరించుకుంది. సువిశాలమైన ప్రాంగణం ... శిల్ప కళా శోభితమైన రాజగోపురం ... అందంగా తీర్చిదిద్దిన ప్రాకారమంటపాలు ... సమస్తపాపాలను కడిగివేసే పుష్కరిణితో ఈ క్షేత్రం ఆనాటి ప్రాభవానికి ప్రతీకగా కనిపిస్తూ వుంటుంది.
గర్భాలయంలో శ్రీరంగనాయకస్వామికి ఒకవైపున గోదాదేవి ... మరోవైపున ఆమె తండ్రి విష్ణుచిత్తుడి మూర్తులు కొలువై వుంటాయి. సాక్షాత్తు అమ్మవారు విల్లిపుత్తూరు నుంచి రావడం, రంగనాయకస్వామిని కూడా ఇక్కడికి రప్పించడం వలన ఈ క్షేత్రం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ఇక్కడి స్వామిని దర్శించడం వలన సకల శుభాలు కలుగుతాయని చెబుతారు.
ఈ క్షేత్రంలోని అమ్మవారిని పూజిస్తే విల్లిపుత్తూరులోని అమ్మవారిని పూజించిన ఫలితం దక్కుతుందని అంటారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆమెకి ఒడిబియ్యం సమర్పించడం ఇక్కడ ఆనవాయతీగా వస్తోంది. పర్వదినాల సమయంలో ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు ... గోదా సమేత రంగనాయకస్వామి అనుగ్రహాన్ని పొందుతూ వుంటారు.