భక్తితో విరిసిన మొల్ల
తెలుగు సాహిత్యంలో 'మొల్ల రామాయణం' ఒక విశిష్టమైన స్థానాన్ని ఆక్రమించింది. తాళ్లపాక తిమ్మక్క తరువాత కవయిత్రిగా మొల్ల కీర్తి ప్రతిష్ఠలు దశదిశలా వ్యాపించాయి. మొల్ల రామాయణం రచించడానికి దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే, వాటి వెనుక భక్తి శ్రద్ధలతో పాటు బలమైన పట్టుదల కనిపిస్తుంది. మొల్ల తండ్రి కేశన ... వారిది కడపజిల్లాలోని 'గోపవరం' గ్రామం. అప్పట్లో ఈ ప్రాంతం శ్రీ కృష్ణదేవరాయల వారి ఏలుబడిలో వుండేది.
గోపవరంలో కేశన మట్టితో కుండలు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. కుమ్మరి కుటుంబంలో జన్మించిన మొల్ల బాల్యం నుంచే తండ్రికి తన తోడ్పాటును అందించసాగింది. అందరితోను కలుపుగోలుగా వుండే మొల్లను అంతా మొల్లక్క ... మొల్లమాంబ అని పిలుస్తూ వుండేవారు. సాహిత్యం పట్ల తండ్రికి గల ఆసక్తిని ఆమె ఊహ తెలిసిన నాటి నుంచే గమనిస్తూ వచ్చింది.
మొల్ల ధోరణి కాస్త దూకుడుగా వుండేది. తన కళ్ళ ముందల అన్యాయం జరిగితే ఆమె చూస్తూ ఊరుకునేది కాదు. ఈ విషయంలో ఆ గ్రామానికి పెద్ద అయిన రామాచారిని కూడా ఆమె ఎదురిస్తూ వుండేది. గ్రామంలో జరుగుతున్న జంతుబలిని ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. అంతే కాకుండా మల్లేశ్వర స్వామిపై తన తండ్రి రాసిన శతకాన్ని అగ్రవర్ణాల వారు ధ్వంసం చేయడం పట్ల నిరసనను వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలోనే ఆమెకి దేవదాసి అయిన రంగానాయకితో పరిచయం ఏర్పడింది. మానవురాలైన గోదాదేవి ... భగవంతుడైన రంగనాయక స్వామిని వివాహమాడిందనే విషయం ఆమె ద్వారానే మొల్లకి తెలిసింది. దాంతో తాను కూడా పెళ్లంటూ చేసుకుంటే దేవుడినే పెళ్లి చేసుకోవాలని ఆమె నిర్ణయించుకుంటుంది. దాంతో ఆమె జీవితం అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది. ఆసక్తికరమైన ఆ ఘట్టాలను గురించి మున్ముందు తెలుసుకుందాం.