ఉప్పును ఉపయోగించని క్షేత్రం
మనం తీసుకునే ఆహారంలో ఉప్పు ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. చాలా రకాల వంటకాలకు ఉప్పు రుచిని తీసుకు వస్తుంది. అందువల్లనే దీనిని 'రుచి' అని కూడా పిలుస్తుంటారు. నిత్య జీవితంలో ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న ఉప్పును దైవ సంబంధమైన నైవేద్యాల్లోను వాడుతూ వుంటారు. అయితే ఒకే ఒక క్షేత్రంలో మాత్రం ఉప్పు అనే మాట వినిపించదు ... కనిపించదు. ఆ క్షేత్రం పేరే 'ఉప్పిలియప్పన్'.
ఇది తంజావూరు జిల్లాలోని 'తిరునాగేశ్వరం' అనే ప్రాంతానికి సమీపంలో దర్శనమిస్తూ వుంటుంది. ఇక్కడి ప్రధాన దైవం శ్రీ వేంకటేశ్వరుడు. అందుకే ఈ క్షేత్రం నిర్మాణ పరంగాను ... పవిత్రత పరంగాను వైభవాన్ని ఆవిష్కరిస్తూ వుంటుంది. ఎంతోమంది రాజులు ... మరెందరో మహనీయులు ఈ క్షేత్రాన్ని దర్శించి తరించినట్టు ఆధారాలు వున్నాయి. ఇక ఈ క్షేత్రంలో ఉప్పు వాడక పోవడానికి వెనుక స్థల పురాణంగా ఒక కథ వినిపిస్తూ వుంటుంది.
పూర్వం ఈ ప్రదేశంలో మార్కండేయ మహర్షి ఓ ఆశ్రమాన్ని నిర్మించుకుని స్వామిని గురించి తపస్సు చేశాడు. ఏ వంటకంలోను ఉప్పును ఉపయోగించకూడదనే ఒక నియమాన్ని పెట్టుకుని ఆయన ఈ తపస్సును పూర్తి చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకి ఒక బాలిక దొరికితే భూదేవి అని పేరుపెట్టి ఆమెని పెంచి పెద్దచేశాడు. తెలిసీ తెలియక వంటల్లో ఉప్పు వేస్తుందేమోననే ఉద్దేశంతో ఆమెని వంటల దగ్గరికి రానివ్వలేదు.
ఒక రోజున మారువేషంలో అక్కడికి వచ్చిన శ్రీనివాసుడు, ఆ యువతిని తనకి ఇచ్చి వివాహం చేయమని మహర్షిని కోరాడు. వచ్చినది భగవంతుడని గ్రహించిన మహర్షి, తన ఆశ్రమంలో ఉండటానికి ఇష్టపడితే ... ఉప్పుకు దూరంగా ఉంటానని మాట ఇస్తే తన కూతురిని ఇచ్చి వివాహం జరిపిస్తానని చెప్పాడు. అందుకు అంగీకరించిన స్వామి అమ్మవారితో సహా ఇక్కడ ఆవిర్భవించినట్టు చెబుతారు.
ఈ నియమం కారణంగానే నేటికీ ఇక్కడ ఉప్పును ఉపయోగించరు. ఇటు పురాణ సంబంధమైన నేపథ్యం ... అటు చారిత్రక వైభవం గల ఈ క్షేత్రానికి అనునిత్యం భక్తుల తాకిడి వుంటుంది. విశేషమైన పర్వదినాల్లో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా కనిపిస్తూ వుంటుంది. ఇక్కడ జరిగే విశేషమైన ఉత్సవాల్లో భక్తులు అశేషంగా పాల్గొంటూ వుంటారు ... స్వామివారి ఆశీస్సులు అందుకుని పునీతులవుతుంటారు.