శ్రీ లలితాంబిక క్షేత్రం
నైమిశారణ్యం అనే పేరుకి ఎంతో ప్రత్యేకత వుంది ... మరెంతో విశిష్టత వుంది. ఉత్తర ప్రదేశ్ కి చెందిన ఈ ప్రాంతం పరమ పవిత్రమైనదని మహర్షులతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే చెప్పినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. లోక కల్యాణానికి కారణమైన అనేకమంది మహర్షుల తపస్సులు ఇక్కడ నిర్వహించబడినవే. వివిధ క్షేత్రాలు దర్శించలేని భక్తులు ఈ ఒక్క క్షేత్రాన్ని దర్శించడం వలన సకల పుణ్యక్షేత్రాలను దర్శించిన ఫలితం కలుగుతుందని అంటారు.
అలాంటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంలో చూడదగిన ఆలయాలలో శ్రీ 'లలితాంబికా దేవాలయం' ఒకటి. 108 శక్తి పీఠాల్లో ఇది ఒకటిగా చెప్పబడుతోంది. చాలాకాలం క్రితమే ఈ ఆలయం శిధిలావస్థకి చేరుకోగా, రాణీ అహల్యాబాయి పునరుద్ధరణ కార్యక్రమాన్ని పూర్తిచేసింది. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో ఆలయం రద్దీగా కనిపిస్తూ వుంటుంది. ఇక్కడి అమ్మవారిని దర్శించడం వలన, సుదీర్ఘకాలంగా పీడిస్తోన్న వ్యాధులన్నీ నశిస్తాయని చెబుతుంటారు. అమ్మవారి అనుగ్రహం కారణంగా ఆశించిన ఫలితాలు పొందినవారు, స్వయంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటూ వుంటారు.