ఇవీ దీపావళి పండుగలోనివే !
దీపావళి పండుగ అంటే చాలామంది అంతకు ముందురోజున వచ్చే 'నరకచతుర్దశి'తో కలుపుకుని రెండు రోజుల పండుగగా భావిస్తుంటారు. నిజానికి ఇది ఐదురోజుల పండుగ. 'ధనత్రయోదశి' ... 'నరక చతుర్దశి' ... 'దీపావళి' ... 'బలిపాడ్యమి' ... 'భగినీహస్త భోజనం' అనేవి దీపావళి పండుగ కిందికే వస్తాయి. కార్తీకశుద్ధ పాడ్యమిని 'బలిపాడ్యమి' అంటారు. ఈ పాడ్యమి బలిచక్రవర్తికి ఎంతో ప్రీతికరమైనదట. ఈ కారణంగానే దీనికి బలిపాడ్యమి అనే పేరు వచ్చింది.
ఈ రోజున అభ్యంగన స్నానం చేసి .. నూతన వస్త్రాలు ధరించి .. బలి చక్రవర్తి బొమ్మను బియ్యపు పిండితో గీసి పూజించాలి. ఇక ఈ రోజున 'గోక్రీడనం' పేరుతో ఆవును లక్ష్మీదేవిగా భావించి పూజించడం ... దీపదానోత్సవం నిర్వహించడం చేస్తుంటారు. ఈ రోజున దానం చేయడం వలన సంపదలు రెట్టింపు అవుతాయని విశ్వసిస్తుంటారు.
ఇక బలిపాడ్యమి మరుసటి రోజు (కార్తీక శుద్ధ విదియ) ను 'భగినీ హస్త భోజనం' అంటారు. దీనినే భాతృ ద్వితీయ ... యమద్వితీయ అని కూడా పిలుస్తుంటారు. యమధర్మరాజు ... ఆయన చెల్లెలు యమునల మధ్య ప్రేమానురాగాలకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటూ వుంటారు. యమధర్మరాజును ఆయన సోదరి ఆహ్వానించి ప్రేమానురాగాలతో స్వయంగా వంటచేసి పెట్టిందట. ఆమె అనురాగానికి ముగ్ధుడైన యమధర్మరాజు ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు.
ఈ రోజున సోదరి చేతి వంటను రుచి చూసిన సోదరులకు నరకలోక ప్రాప్తి ... అపమృత్యు దోషాలు కలగకుండా, సోదరులకు వండి వడ్డించిన సోదరీమణులకు వైధవ్యం కలగకుండా ఉండేలా ఆమె వరాన్ని ప్రసాదించమని కోరింది. అందుకు ఆనందంగా అంగీకరించిన యమధర్మరాజు ఆ మాటకు కట్టుబడి ఉంటానని తన చెల్లెలికి హామీ ఇచ్చాడు. ఈ కారణంగా సోదరుల యోగ క్షేమాలను ఆకాంక్షించే సోదరీమణులంతా, ఈ రోజున తమ సోదరులను ఆహ్వానించి స్వయంగా వండి వడ్డిస్తుంటారు.