శ్రీ సీతారామాలయం
భారతదేశంలో రామాలయంలేని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. అంతగా శ్రీరాముడు అశేష ప్రజానికానికి దగ్గరయ్యాడు. ధర్మమార్గాన్ని అనుసరించి శ్రీ రాముడు ... పాతివ్రత్య ధర్మాన్ని పాటిస్తూ సీతాదేవి ఈ లోకానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. రామాయణం ఏ కాలంలో జరిగినా ప్రజలకు సీతారాములతో గల అనుబంధం పెరుగుతూ వస్తుందే గాని తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో కొలువైన సీతారాములు విశేష పూజలు ... విశిష్ట సేవలు అందుకుంటున్నారు.
అలాంటి ఆలయాల్లో హైదరాబాదులోని 'రామకోటి' (రామ్ కోఠి )ఒకటిగా దర్శనమిస్తుంది. ఇది ఇటీవల కాలంలో నగరంలో ఓ మూల నిర్మించబడిన ఆలయం కాదు. దీనివెనుక కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్నట్టుగా స్థలపురాణం చెబుతోంది. పూర్వం సీతారాములు వనవాసం చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చారట. అప్పట్లో ఈ ప్రాంతమంతా అరణ్యంగా వుండేది. చెట్లతో ... గుట్టలతో వున్న ఈ ప్రదేశంలో సీతారాములు కొంతసేపు విశ్రమించినట్టు చెబుతారు.
ఈ కారణంగానే ఈ ప్రదేశం పవిత్రమైనది ... అశేష భక్త జనకోటి దర్శించుకునే దివ్య క్షేత్రమైంది. గర్భాలయంలో సీతారామ లక్ష్మణులు, కరుణామృతాన్ని కురిపిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంటారు. స్వామివారికి ఎదురుగా హనుమంతుడు ప్రత్యేక ఆలయంలో కొలువై కనిపిస్తుంటాడు. ఇక్కడి గర్భాలయంలో హనుమంతుడితో పాటుగా వినాయకుడు పూజలు అందుకుంటూ వుండటం విశేషం.
హనుమంతుడు ... వినాయకుడు కూడా ప్రాచీనకాలం నాటివారే. ఎందుకంటే ఈనాటి శిలా రూపాలకు, ఆనాటి రూపాలకు మధ్య తేడా స్పష్టంగా తెలుస్తూ వుంటుంది. ఇక ఇదే ప్రాంగణంలో శివయ్య కూడా భక్తులను అనుగ్రహిస్తూ కనిపిస్తాడు. ఈ కారణంగా ఇది శివకేశవ క్షేత్రంగా అలరారుతోంది. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన శత్రుపరమైన భయాలు తొలగి, సంపదలను ... విజయాలను పొందుతారని అంటారు.
శ్రీరామనవమి .. హనుమజ్జయంతి .. వినాయకచవితి .. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు .. ఉత్సవాలు జరుగుతుంటాయి. కార్తీకమాసంలో జరిగే సత్యనారాయణ స్వామి వ్రతాల్లో, రుద్రాభిషేకాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. శివకేశవులను దర్శిస్తూ .. స్మరిస్తూ .. తరిస్తుంటారు.