సప్తముఖ హనుమ క్షేత్రం
శ్రీరాముడి భక్తుడిగా ... శివాంశ సంభూతుడిగా హనుమంతుడు అశేష భక్త జనకోటి హృదయాలలో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అలాంటి హనుమంతుడు భక్తాంజనేయుడుగా ... వీరాంజనేయుడుగా ... ప్రసన్నాంజనేయుడుగా ... ధ్యానాంజనేయుడుగా వివిధ క్షేత్రాల్లో పూజలు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో స్వామి పంచముఖ హనుమంతుడుగా ఆవిర్భవించిన క్షేత్రాలు మరింత శక్తిమంతమైనవిగా అలరారుతున్నాయి.
ఇక అరుదుగా ... అత్యంత మహిమాన్వితంగా విలసిల్లుతోన్న సప్తముఖ హనుమంతుడి క్షేత్రాలు కూడా లేకపోలేదు. అలాంటి క్షేత్రాల్లో ముందువరుసలో నిలిచి తన ప్రత్యేకతను చాటుకుంటోంది 'కాళ్లాపూర్' సమీపంలోని 'సప్తముఖ హనుమ క్షేత్రం'. రంగారెడ్డి జిల్లాలోని ఈ క్షేత్రం అత్యంత పురాతనమైనదిగా చెప్పబడుతోంది. త్రేతాయుగంలో సీతారాములు తిరుగాడిన పుణ్య ప్రదేశం కనుక, హనుమంతుడు ఈ ప్రదేశంలో స్వయంభువుగా ఆవిర్భవించాడని అంటారు.
మహర్షులు ... మునులు ... మహా భక్తులు దర్శించిన స్వామి ఆలయం, ఆ తరువాత కాలంలో శిధిలావస్థకు చేరుకోగా ఓ భక్తుడు పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ పునరుద్ధరణ కార్యక్రమాలు జరిగాయి. ఆనాటి నుంచి స్వామివారికి నిత్యపూజాభిషేకాలు జరుగుతూ వస్తున్నాయి.
గర్భాలయంలో స్వామివారు విగ్రహ రూపంలో కాకుండా రాతి పలకల రూపంలో దర్శనమిస్తూ వుంటాడు. పురాణపరమైన నేపథ్యం వున్న కారణంగా ఈ క్షేత్రానికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. పర్వదినాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతూ వుంటుంది. ఇక్కడి హనుమంతుడిని దర్శించడం వలన గ్రహసంబంధమైన దోషాలు తొలగిపోతాయనీ, సిరిసంపదలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.