శివరామ క్షేత్రం
రావణ సంహారం అనంతరం ఆ పాపానికి పరిహారంగా శ్రీరాముడు అనేక ప్రాంతాల్లో శివలింగాలను ప్రతిష్ఠిస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఆయన లంక నుంచి అయోధ్యకి పుష్పక విమానంలో వెళుతూ, నేటి కృష్ణా జిల్లా 'ఐలూరు'లో దిగినట్టు ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. కృష్ణా నదికి ఇరువైపులా కూడా శ్రీ రాముడు ... శివలింగాలను ప్రతిష్ఠించాడు. ఈ కారణంగా ఈ క్షేత్రాన్ని ఉభయ రామ క్షేత్రంగా పిలుస్తుంటారు.
కృష్ణా నదికి ఒకవైపున సైకత లింగాన్ని ప్రతిష్ఠించిన రాముడు, హనుమంతుడు కాశీ నుంచి తెచ్చిన శివలింగాన్ని ఐలూరులో ప్రతిష్ఠించినట్టుగా చెబుతుంటారు. ఇక ఈ శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించిన కారణంగా ఇక్కడ ఆయన ఆలయం కూడా నిర్మించబడింది. గర్భాలయంలో రాముల వారు సీతా సమేతంగా ... లక్ష్మణ .. హనుమ సహితంగా దర్శనమిస్తూ వుంటాడు.
కృష్ణా నదిలో స్నానం చేసిన భక్తులు ముందుగా రామేశ్వర లింగాన్ని దర్శించుకుని, ఆ తరువాత శ్రీరాముడి సన్నిధికి చేరుకుంటారు. అటు శివలింగానికి ... ఇటు రామాలయానికి పురాణ సంబంధమైన నేపథ్యం వుండటం వలన ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగానే వుంటుంది.
శివరాత్రి సందర్భంగా జరిగే శివపార్వతుల కళ్యాణ మహోత్సవం, శ్రీ రామనవమి సందర్భంగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవం చూడటానికి రెండు కళ్ళూ సరిపోవనిపిస్తుంది. అశేష భక్తజనులు ఈ వేడుకల్లో పాల్గొని ఆనందానుభూతులు పొందుతుంటారు ... హరిహరుల కరుణా కటాక్ష వీక్షణాలతో పునీతులవుతుంటారు.