విష్ణువుగా మారిన శివుడు
మువ్వగోపాలుడి పదాలను పాడుకుంటూ ... పరవశిస్తూ క్షేత్రయ్య ముందుకు సాగుతున్నాడు. ఈ సమయంలోనే ఆయనకి 'చిదంబరం' లో జరుగుతోన్న మతకల్లోల గురించి తెలిసింది. నాయక రాజుల ఏలుబడిలో గల చిదంబరానికి క్షేత్రయ్య చేరుకున్నాడు. వైష్ణవ మతాభిమానంతో, శైవులపై దాడికి పాల్పడుతోన్న వెంకటకృష్ణప్ప నాయకుడిని క్షేత్రయ్య అడ్డుకున్నాడు.
ఆయన ధైర్యసాహసాలకి కృష్ణప్ప నాయకుడు ఆశ్చర్యపోయాడు. వైష్ణవ మతాభిమానంతో శైవులను హింసించడం ... శైవ క్షేత్రాన్ని వైష్ణవ క్షేత్రంగా మార్చాలనుకోవడం మంచిది కాదని కృష్ణప్పతో చెప్పాడు క్షేత్రయ్య. శివుడికీ ... విష్ణువుకి భేదం లేదనీ, ఒకరి హృదయంలో ఒకరు వున్నారని అన్నాడు. శివకేశవులు వేరనుకోవడం అవివేకమనీ, సమస్త పురాణాల సారాంశాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించమని కోరాడు.
శివకేశవులు ఒక్కటేనని నిరూపిస్తే, తన అభిప్రాయాన్ని మార్చుకుంటానని చెప్పాడు కృష్ణప్ప నాయకుడు. దాంతో నటరాజస్వామి ఎదురుగా నిలిచి ఈ సందేహాన్ని తీర్చవలసిందిగా ఆ పరమశివుడినే కోరాడు క్షేత్రయ్య. గర్భాలయంలో నటరాజస్వామి క్షణకాలం పాటు విష్ణుమూర్తిగా దర్శనమిచ్చాడు. ఆ దృశ్యం చూసిన వాళ్లంతా తమ జన్మ ధన్యమైందని అనుకున్నారు.
క్షేత్రయ్య అసమానమైన భక్తిని ప్రశంసిస్తూ, తన అజ్ఞానాన్ని మన్నించవలసిందిగా కోరాడు కృష్ణప్పనాయకుడు. ఆయన అభ్యర్ధనమేరకు నటరాజస్వామి ఆలయంలో గోవిందరాజ స్వామిని ప్రతిష్ఠించాడు క్షేత్రయ్య. నాటి నుంచి ఈ క్షేత్రం హరిహర క్షేత్రంగా పూజలందుకుంటూ, అశేష భక్త జనులపాలిట అక్షయపాత్రలా కోరిన వరాలను ప్రసాదిస్తోంది.