వెతలు తీర్చే వేంకటేశ్వరుడు
వెన్నెలను ... వేంకటేశ్వరస్వామిని ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తూనే వుంటుంది. ఆ చల్లదనంలో కడవరకూ కదలకుండా ఉండిపోవాలనే అనిపిస్తూ వుంటుంది. చక్కని రూపు .. చల్లని చూపు వేంకటేశ్వరస్వామి సొంతం. అసలు ఆయన సౌందర్యం చూడగానే సగం కష్టాలను మరచిపోవడం జరుగుతూ వుంటుంది.
సాక్షాత్తు వైకుంఠవాసుడే అభయమిస్తూ వుండగా, కాలంతో పాటు కరిగిపోయే కష్టాలు ఏమీ చేయలేవనే భరోసా కలుగుతుంది. అలా భక్తులకు తనపట్ల అపారమైన విశ్వాసాన్ని కలిగించిన వేంకటేశ్వరస్వామి, అనేక ప్రదేశాల్లో కొంగుబంగారమై అలరారుతున్నాడు. ఈ నేపథ్యంలోనిదే హైదరాబాద్ - ఉప్పల్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం.
ఇక్కడి వేంకటేశ్వరుడు పద్మావతి - గోదాదేవి సమేతంగా దర్శనమిస్తూ ఉంటాడు. గర్భాలయంలో నిలువెత్తు రూపంతో స్వామివారు మనోహరంగా కనిపిస్తూ వుండగా, ఇరువైపులా గల ప్రత్యేక మందిరాల్లో పద్మావతి - గోదాదేవి పూజలు అందుకుంటూ వుంటారు. వినాయకుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రంలో 11 ప్రదక్షిణలు చేసిన వారి మనోభీష్టాలు నెరవేరతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.
పర్వదినాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణలు ... పూజలు జరుపుతుంటారు. వైశాఖ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ వుంటారు. తొమ్మిది రోజులపాటు ఘనంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. వైకుంఠ వాసుడి వైభవం చూస్తూ తన్మయత్వంతో తరిస్తుంటారు.