వరాలనిచ్చే రంగనాథ క్షేత్రం
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎన్నో ప్రాచీన దేవాలయాలు వున్నాయి. నగర జీవితం ఉరుకుల పరుగులతో కొనసాగుతూ వుండటం వలన, ఆయా ఆలయాల విశిష్టత గురించి తెలుసుకునే అవకాశం చాలామందికి లేకుండా పోతుంది. దాంతో వాళ్లు ప్రాచీన ఆలయాలను సైతం, ఈ మధ్యే నిర్మించబడినవిగా భావిస్తున్నారు.
ఈ నగరం ఏర్పడక ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ ఎన్నో ఆలయాలు ఆవిర్భవించాయి. అలాంటి ప్రాచీన దేవాలయాల్లో 'పురానా పూల్' లోని శ్రీ రంగనాథస్వామి ఆలయం ఒకటి. పూర్వం కశ్యప ప్రజాపతి ఈ ప్రదేశంలో స్వామి గురించి తపస్సు చేశాడని చెబుతారు. ఆయన అభ్యర్ధనమేరకే స్వామి ఇక్కడ కొలువయ్యాడని అంటారు. ఆ తరువాత కాలంలో శిధిలావస్థకు చేరుకున్న ఈ ఆలయం, కొన్ని వందల సంవత్సరాల తరువాత వెలుగులోకి వచ్చింది.
పునఃనిర్మాణం జరుపుకున్న దగ్గర నుంచి ఆలయంలో నిత్యపూజలు జరుగుతూ వస్తున్నాయి. గర్భాలయంలో స్వామివారు శయన ముద్రలో సమ్మోహనకరంగా దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారి పాదాలచెంత లక్ష్మీదేవి - గోదాదేవి, మరోవైపున ఆళ్వారులు కనిపిస్తుంటారు. రంగనాథస్వామిని దర్శించడం వలన వ్యాధులు ... రుణ బాధలు తొలగిపోతాయని చెబుతుంటారు.
ప్రతియేటా స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలను చూసితీరవలసిందే. వివిధ నగరాలనుంచి తెప్పించిన రకరకాల పూలమాలికలతో స్వామివారిని అలంకరిస్తూ వుంటారు. ఈ సందర్భంగా జరిగే స్వామి వాహన సేవల్లో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొంటూ వుంటారు. ఇక ధనుర్మాసంలో కూడా ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు జరుపుతుంటారు.
ఈ క్షేత్రానికి పాలకుడిగా హనుమంతుడు వ్యవహరిస్తూ ఉంటాడు. ఇక్కడ నెలకొని వున్న హనుమంతుడిని పూజించిన వారికి కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయని అంటారు. అటు పురాణ నేపథ్యం ... ఇటు చారిత్రక వైభవం గల ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సమస్త దోషాలు నశించి, సకల శుభాలు కలుగుతాయని స్థానికులు చెబుతుంటారు.