శ్రీవారి పంచమూర్తులు
వైష్ణవ సంబంధమైన పుణ్యక్షేత్రాలలో ధృవబేరంతో పాటుగా స్నపన బేరం .. ఉత్సవ బేరం ... బలిబేరం .. శయనబేరం కొలువై వుంటాయి. ఈ అయిదింటినీ కలిపి 'పంచబేరాలు' అంటారు. ఇక తిరుమలలోని 'ఆనందనిలయం'లో శ్రీనివాసుడు 'ధృవబేరం' గా దర్శనమిస్తూ వుంటాడు. సుమారు 9 అడుగుల ఎత్తు వుండే ధృవమూర్తి సౌందర్యం భక్తులను సమ్మోహితులను చేస్తుంటుంది.
ఇక స్నపన బేరంగా 'ఉగ్ర శ్రీనివాసమూర్తి' .. ఉత్సవ బేరంగా 'మలయప్ప స్వామి' .. బలిబేరంగా 'కొలువు శ్రీనివాసమూర్తి' .. శయనబేరంగా 'భోగ శ్రీనివాసమూర్తి'అంగరంగ వైభవంగా దర్శనమిస్తుంటారు. ప్రస్తుతం స్నపన బేరంగా వున్న ఉగ్ర శ్రీనివాసమూర్తి ఒకప్పుడు ఉత్సవ మూర్తిగా ఉండేవాడు.
అయితే ఒకసారి ఈ ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగింపుగా బయటికి తీసుకువెళ్లగానే ప్రళయం వచ్చినంత పనైందట. ఆనాటి నుంచి ఏడాదికి ఒకసారి 'కార్తీక ద్వాదశి' రోజున సూర్యోదయానికి ముందే స్వామివారిని ఊరేగిస్తారు. ఉగ్ర శ్రీనివాసమూర్తి తరువాత 'ఉత్సవ బేరం'గా మలయప్ప స్వామి కొనసాగుతున్నాడు. ఈ స్వామితో పాటు శ్రీదేవి - భూదేవి కూడా కొలువుదీరి ఉత్సవాల్లో పాల్గొంటూ వుంటారు.
13 శతాబ్దం ప్రథమార్ధంలో ఈ విగ్రహాలు కొండల్లో దొరకడం వలన స్వామిని 'మలయప్ప'అని పిలుస్తుంటారు. ఇక 'బలిబేరం' గా కొలువు శ్రీనివాసమూర్తి దర్శనమిస్తుంటాడు. ఈ స్వామి ప్రతినిత్యం తోమాలసేవ అనంతరం 'తిరుమామణి' మంటపంలో కొలువుదీరతాడు. ఆనాటి పంచాంగ వివరాలను, ముందు రోజున హుండీ ద్వారా స్వామివారికి కానుకలుగా వచ్చిన ధన .. కనక .. వస్తు .. వాహనాలకు సంబంధించిన వివరాలను సైతం చదివి వినిపిస్తారు.
ఇక 'శయన బేరం'గా భోగ శ్రీనివాసమూర్తి దర్శనమిస్తాడు. ఈ స్వామిని ధృవ మూర్తికి ప్రతిరూపంగా చెబుతుంటారు. రెండు మూర్తుల మధ్య స్వర్ణ బంధం వుంటుంది. ప్రతినిత్యం భోగ శ్రీనివాస మూర్తికి పంచామృత అభిషేకం జరుగుతుంది. ఒక్క ధనుర్మాసంలో తప్ప మిగతా మాసాల్లో భోగ శ్రీనివాసుడు ఏకాంతసేవలో శయనమూర్తిగా నయనానందాన్ని కలిగిస్తుంటాడు.