శ్రీ పద్మాక్షీ ఆలయం
శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు ఎక్కడైతే కొలువై వుంటుందో, అక్కడ సిరిసంపదలు ... విజయాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. సహజంగానే అమ్మవారి మనసు సున్నితంగా వుంటుంది. అందువలన ఆపదలో వున్న తన బిడ్డలను ఆదుకోవడంలో ఆమె ఎప్పుడూ ముందే వుంటుంది. ఈ కారణంగానే అమ్మవారికి సంబంధించిన క్షేత్రాలకి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది.
అలా నిత్యం భక్తులతో సందడిగా దర్శనమిచ్చే క్షేత్రాల జాబితాలో హనుమకొండలోని శ్రీ పద్మాక్షీ అమ్మవారి క్షేత్రం కూడా కనిపిస్తుంది. కొండపై గల గుహలో కొలువుదీరిన ఇక్కడి అమ్మవారు అత్యంత శక్తిమంతమైనదిగా చెబుతుంటారు. ప్రాచీనకాలంలో ఈ కొండపై కొందరు మునులు అమ్మవారి సాక్షాత్కారం కోసం తపస్సు చేశారట. వాళ్ల అభ్యర్థనమేరకు అమ్మవారు ఇక్కడ కొలువైంది. ఆ తల్లి ఆదేశం మేరకు ఆ మునీశ్వరులు కొండ దిగువన శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఆ రోజు నుంచి అమ్మవారు ఇక్కడి ప్రజలపై తన కరుణా కటాక్ష వీక్షణాలను కురిపిస్తూనే వుంది.
గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తి సుందరంగా ... సుకుమారంగా విశాల నేత్రాలతో దర్శనమిస్తుంది. కాకతీయ రాజులు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి పరచడంలో కీలకమైన పాత్రను పోషించారు. కాకతీయ రాజులలో ఒకరైన మాధవవర్మకు అమ్మవారు 'వీర ఖడ్గం' ప్రసాదించిందని స్థలపురాణం చెబుతోంది.
ఇక ఇక్కడి గుహ గోడలపై 'మహావీరుడు' కనిపిస్తూ ఉంటాడు. కాకతీయుల కాలానికి చెందిన ఒక మంత్రి జైన మతాభిమాని కావడమే ఇందుకు కారణమని అంటారు. ప్రతి శుక్రవారం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ జరిగే దసరా నవరాత్రి ఉత్సవాలు ... బతుకమ్మ ఆటలు చూసి తీరవలసిందే.