శ్వేతార్కమూల గణపతి
గణపతి ఆలయాల్లో ఎప్పుడు చూసినా భక్తుల రద్దీ కనిపిస్తూనే వుంటుంది. ఎవరు ఏ శుభ కార్యాన్ని ప్రారంభించాలన్నా ఆయన ఆశీస్సులు ఉండవలసిందే కాబట్టి, అంతా ఆయనను దర్శించి సేవిస్తూనే వుంటారు. ఇక సాధారణ ఆలయాలకంటే , గణపతి స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రాలను విశిష్టమైనవిగా భక్తులు భావిస్తుంటారు. 'శ్వేతార్కమూల గణపతి' కొలువైన క్షేత్రమైతే మరింత మహిమాన్వితమైనదిగా విశ్వసిస్తూ వుంటారు.
తెల్లజిల్లేడు చెట్టు మూలం సంపూర్ణమైన గణపతి ఆకారాన్ని సంతరించుకుంటుంది ... దీనినే శ్వేతార్కమూల గణపతి అని అంటారు. ఇలా సహజ సిద్ధంగా ఏర్పడిన స్వామిని ఆరాధించడం వలన అత్యుత్తమమైన ఫలితాలు ప్రాప్తిస్తాయని 'గణేశ పురాణం' చెబుతోంది. ఈ కారణంగా అరుదైన ఈ క్షేత్రం ఎంత దూరంలో ఉన్నప్పటికీ భక్తులు తరలివస్తూనే వుంటారు. ప్రకృతి స్వరూపుడైన ఆ స్వామిని దర్శించి వెళుతుంటారు.
అంతటి విశిష్టమైన క్షేత్రం వరంగల్ జిల్లా కాజీపేటలో నెలవై భక్తుల పాలిట కామధేనువులా విలసిల్లుతోంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక భక్తుడికి కలలో గణపతి కనిపించి, తన శ్వేతార్కమూల రూపం ఫలానా చోటున వుందని చెప్పి, దానిని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్పాడు. స్వామి చెప్పిన ఆనవాళ్ల ప్రకారం తెల్లజిల్లేడు చెట్టును అన్వేషిస్తూ బయలుదేరిన ఆ భక్తుడికి, నల్గొండ జిల్లాలోని ఓ ప్రదేశంలో స్వామి రూపం కనిపించింది.
ఆ గణపతి ప్రతిమను తీసుకుని వచ్చి ఇక్కడి ప్రదేశంలో ఆలయ నిర్మాణం చేసి ప్రతిష్ఠించారు. ఆ రోజు నుంచి భక్తుల తాకిడి పెరుగుతూనే వుంది. ఇక్కడి శ్వేతార్కమూల గణపతి పూర్తి వెండి కవచంతో దర్శనమిస్తూ ఉంటాడు. ప్రతి మంగళవారం రోజున ... విశేషమైనటువంటి పుణ్య తిథుల్లోను స్వామివారికి ప్రత్యేక పూజాభిషేకాలు నిర్వహిస్తూ వుంటారు. పంచామృతాలతో ... వివిధ రకాల పండ్ల రసాలతో స్వామివారికి జరిగే అభిషేకం చూసితీరవలసిందే.
ఇదే ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మీదేవి ... సరస్వతీ దేవి ... సంతోషిమాత ... శిరిడీ సాయిబాబా ప్రత్యేక మందిరాలలో కొలువై పూజలు అందుకుంటూ వుంటారు. శ్వేతార్కమూల గణపతిని దర్శించడం వలన సమస్త దోషాలు నివారించబడి, సకల శుభాలు చేకూరతాయని ఇక్కడి భక్తులు అనుభవ పూర్వకంగా చెబుతుంటారు ... అంకిత భావంతో ఆ స్వామిని ఆరాధిస్తూ తరిస్తుంటారు.