అరుదైన హరిహర క్షేత్రం
సాధారణ పుణ్యక్షేత్రలతో పోలిస్తే శివకేశవులు కొలువైన పుణ్యక్షేత్రాలు మరింత విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని క్షేత్రాల్లో శివకేశవుల ఆలయాలు వేరువేరుగా దర్శనమిస్తూ వుంటాయి. మరికొన్ని క్షేత్రాలలో ఒకే ఆలయ ప్రాంగణంలో శివకేశవులు కొలువై పూజలు అందుకుంటూ వుంటారు. కానీ ఒకే గర్భాలయంలో అది కూడా ఒకే స్థూపం(ఏకశిల )పై శివకేశవులు కొలువై భక్తులను అనుగ్రహిస్తూ వుండటం అరుదైన విషయంగా చెప్పవచ్చు.
ఆశ్చర్యచకితులను చేసే అలాంటి క్షేత్రం మనకి రంగారెడ్డి జిల్లాలోని'జిల్లెలగూడ'లో దర్శనమిస్తుంది. ప్రాచీన కాలానికి చెందిన ఈ క్షేత్రంలో అడుగు పెట్టగానే, ఇది మహిమాన్వితమైన దివ్యక్షేత్రమనే విషయం అర్థమైపోతుంది. విశాలమైన ప్రాంగణం ... ఆలయ నిర్మాణం నాటివైభవానికి నిర్వచనంగా నిలిచి కనిపిస్తుంటాయి. ఇక్కడి కోనేరులో తాను ఉన్నట్టుగా చెప్పి, తన ప్రతిమని బయటికి తీసి ప్రతిష్ఠించమని ఓ భక్తుడికి కలలో కనిపించి స్వామి చెప్పడంతో, ఆ ప్రకారమే పునఃప్రతిష్ఠ జరిగిందని స్థలపురాణం చెబుతోంది.
గర్భాలయంలో నిలువుగావున్న ఏకశిలపై, క్రింది భాగంలో శ్రీ మహా విష్ణువు ... మధ్య భాగంలో మత్స్య రూపం ... పై భాగంలో లింగాకారం దర్శనమిస్తూ వుంటుంది. ఇది అరుదైన విషయం కావడంతో భక్తులు దీనిని విశిష్టమైన క్షేత్రంగా భావిస్తుంటారు. ఈ ఆలయ దర్శనభాగ్యం కారణంగా కష్టాలు కరిగిపోతాయనీ, సమస్యలు తొలగిపోతాయని స్థానికులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. పరివారదేవతలతో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. పరమాత్ముని లీలావిశేషాలలోని పరమార్థం బోధపడుతుంది.