అప్పనపల్లి
సాధారణంగా పుణ్యక్షేత్రాలకి వెళ్లినప్పుడు దైవదర్శనం విషయంలో తోపులాట జరుగుతూ వుంటుంది. దైవాన్ని దగ్గరగా చూడటానికి అంతా ఆరాటపడుతూ వుంటారు. నిజానికి నిస్వార్థం తో తనని ఆరాధించే భక్తులు ఎంత దూరంలో వున్నా ఆ స్వామి వారిని చూస్తూనే ఉంటాడు. మహాభక్తుల చరిత్రలను పరిశీలిస్తే వారి రాకకోసం భగవంతుడే ఎదురుచూసిన సందర్భాలు కనిపిస్తాయి.
భగవంతుడు తనని చూడటానికి వచ్చి ఇబ్బందులు పడుతున్న వారినేకాదు, చూడాలనివున్నా రాలేకపోయిన వారికోసం మరింత తాపత్రయపడుతుంటాడు. అవసరమైతే తన భక్తుల గ్రామాలకి తానే తరలిపోతుంటాడు. అలా ఆ శ్రీనివాసుడు తన భక్తుడి కోసం తరలి వచ్చిన క్షేత్రమే 'అప్పనపల్లి'. మహిమాన్వితమైన ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురానికి సమీపాన గోదావరి తీరాన విలసిల్లుతోంది. ప్రాచీన కాలంలో 'అప్పన్న' అనే భక్తుడు స్వామివారి గురించి ఈ ప్రదేశంలో తపస్సు చేయడం వలన ఈ గ్రామానికి ఈ పేరు వచ్చిందని అంటారు.
ఇక ఈ క్షేత్రానికి స్వామివారు రావడానికి కారకుడు 'రామస్వామి' అనే భక్తుడు. ఆయన ఈ గ్రామంలో కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ వచ్చిన లాభాలలో కొంత మొత్తాన్ని స్వామికి కేటాయిస్తూ ఉండేవాడు. ఆ డబ్బుతో తరచూ తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉండేవాడు. వయసు పైబడిన కారణంగా ఆయన తిరుమల వెళ్లలేక ఆవేదన చెందాడు. దాంతో త్వరలో తానే ఆ గ్రామానికి వస్తున్నట్టుగా శ్రీనివాసుడు కలలో ఆయనకి చెప్పాడు.
దాంతో రామస్వామి సంతోషంతో పొంగిపోయాడు. తన కొబ్బరికాయల దుకాణంలోనే స్వామివారి నిలువెత్తు చిత్రపటం వుంచి పూజించడం మొదలుపెట్టాడు. ఆ చిత్రపటం నేటికీ ఆలయంలోని ప్రత్యేక మందిరంలో దర్శనమిస్తుంది. స్వామి ఆదేశం మేరకు ఈ గ్రామంలో ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయ గోపురం ... ప్రాకారాలపై ఎటు చూసినా పురాణ సంబంధమైన దృశ్యాలతో కూడిన వివిధ దేవతా ప్రతిమలు దర్శనమిస్తుంటాయి.
గర్భాలయంలో స్వామి 'బాల బాలాజీ'గా కొలువై ఉంటాడు . ప్రత్యేక మందిరాలలో పద్మావతి దేవి - ఆండాళ్ అమ్మవారు పూజలు అందుకుంటూ వుంటారు. అప్పనపల్లి వేంకటేశ్వరుడు అమ్మకన్నా సున్నితమైన మనసున్నవాడనీ, కోరినవరాలను ఆప్యాయంగా అందిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు. వివిధ పర్వదినాల్లోను ... జ్యేష్ట మాసంలో అయిదురోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలకి గాను భక్తులు విశేషసంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని ధన్యులవుతుంటారు.