ఘోణ తీర్థ విశిష్టత
తిరుమలలో కోనేటిరాయుడిని కొలుచుకోవడానికి ఆవిర్భవించిన పరమపవిత్రమైన తీర్థాలలో 'ఘోణ తీర్థం' ఒకటి. ఈ తీర్థ మహాత్మ్యం గురించిన ప్రస్తావన పురాణాల్లో కనిపిస్తుంది. తుంబురు తీర్థం సమీపంలో కనిపించే ఈ తీర్థం సమస్త పాపాలను ... సకల దోషాలను తొలగిస్తుందని పురాణాల్లో చెప్పడం జరిగింది. ఒకసారి ఈ తీర్థమున స్నానమాచరించినా వందలాది యజ్ఞాలు ... వేలాది దానాలను చేసిన ఫలితం కలుగుతుందని అంటారు.
ఈ తీర్థం యొక్క మహిమను తెలిపే కథ కూడా ఒకటి మనకి వినిపిస్తుంది. పూర్వం తుంబురుడు ఇక్కడి తీర్థంలో స్నానం చేసి స్వామివారిని సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. ఈ కారణంగా నాడు ఆయన స్నానమాడిన తీర్థానికి 'తుంబుర తీర్థం' అనే పేరు వచ్చింది. ఈ తీర్థం సమీపంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఆయన స్వామివారిని సేవిస్తూ ఉండేవాడు. ఒకసారి పూజకు అవసరమైన ఏర్పాట్లు చేయమని తుంబురుడు భార్యతో చెప్పగా, అందుకామె నిరాకరిస్తూ అసహనాన్ని ప్రదర్శించింది.
దాంతో ఆయన కోపించి 'కప్ప' రూపంలో'ఘోణ తీర్థం'లో నివసించమని శపించాడు. ఘోణ తీర్థ మహాత్మ్యం గురించి విన్నప్పుడు శాపవిమోచనం కలుగుతుందని చెప్పాడు. ఆనాటి నుంచి ఆమె ఘోణ తీర్థంలోని పిప్పల వృక్షంలో కప్పగా నివసించసాగింది. అలాంటి పరిస్థితుల్లో తన శిష్యులతో కలిసి ఆ ప్రాంతానికి వచ్చాడు అగస్త్య మహర్షి.
ఆయన ఘోణతీర్థ మహాత్మ్యం గురించి తన శిష్యులకు చెబుతుండగా విన్న ఆ కప్ప , తన నిజరూపాన్ని పొంది మహర్షికి నమస్కరించింది. జరిగినది ఆయనకి చెప్పి, ఆ మహర్షి ఆశీస్సులు తీసుకుని ఆశ్రమానికి చేరుకుంది. ఆనాటి నుంచి ఆమె భర్త ఆదేశాల మేరకు నడచుకుంటూ ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించింది.