ఆశించిన ఫలితాన్నిచ్చే ధనవ్రతం
సాధారణంగా స్త్రీలు సంతాన సౌభాగ్యాలను ఆశించి నోములు - వ్రతాలు చేస్తుంటారు. ఇక వివాహం ఆలస్యమవుతున్నవాళ్లు ... వైవాహిక జీవితం సరిగ్గాలేని వాళ్లు ఆచరించడానికి కూడా కొన్ని వ్రతాలు వున్నాయి. అలాగే కాలం కలిసిరావాలనే ఉద్దేశంతో స్త్రీ పురుషులు చేసే వ్రతాలు కూడా వున్నాయి. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది ... 'ధనవ్రతం'.
'భాద్రపద శుద్ధ పాడ్యమి' రోజున ఆచరించవలసిన ఈ వ్రత విధానం గురించిన ప్రస్తావన మనకి 'విష్ణు ధర్మోత్తర పురాణం'లో కనిపిస్తుంది. సహజంగానే కొంతమంది తమకి సంబంధించిన రంగాలలో అసమానమైన ప్రతిభను ప్రదర్శిస్తుంటారు. కష్టపడే తత్వం ... చురుకుగా పని పూర్తిచేసే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ వీరు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుంటారు. దాంతో సంపాదన విషయంలో తాము అనుకున్న స్థాయికి చేరుకోలేక తీవ్రమైన అసంతృప్తికి లోనవుతుంటారు. తమ వెనుకబాటుకి కారణాన్ని కనిపెట్టలేక ఆందోళన చెందుతుంటారు.
ఇలాంటి పరిస్థితుల్లో దైవానుగ్రహం ఉండాలనే విషయాన్ని గ్రహించి 'ధనవ్రతం' చేయాలని పురాణాలు చెబుతున్నాయి. 'భాద్రపద శుద్ధ పాడ్యమి' రోజున ఉదయాన్నే తలస్నానం చేసి, పూజా మందిరాన్ని శుభ్రపరచాలి. లక్ష్మీనారాయణుల ప్రతిమలను కానీ ... ఫోటోలను గాని మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. పూజా మందిరాన్ని వివిధరకాల పూలతో అలంకరించాలి. ఇక ఈ వ్రత విధానంలో భాగంగా ప్రత్యేకించి నల్లకలువలను ... గుంటగలగర పత్రాలను తెప్పించి లక్ష్మీనారాయణులను పూజించాలి.
తమ మనసులోని కోరికను చెప్పుకుని అది నెరవేరేలా చూడమని లక్ష్మీనారాయణులను ప్రార్ధించాలి. లక్ష్మీనారాయణులకు ఆవుపాలతో చేసిన పాయసాన్ని ... మారేడు కాయలోని లోపలి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత తమ శక్తికొద్ది బ్రాహ్మణులకు దానధర్మాలు చేయాలి. ఈ విధంగా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది. దాంతో ప్రతిభకి తగిన గుర్తింపు లభించడమే కాకుండా, ఆర్ధికపరమైన ఎదుగుదలకు అవకాశాలు దక్కుతాయి.