శ్రీ ముక్తేశ్వర క్షేత్రం
భక్తులకు ముక్తిని అనుగ్రహించడానికి పరమశివుడు ఆవిర్భవించిన అత్యంత పవిత్రమైన క్షేత్రమే 'శ్రీ ముక్తేశ్వరస్వామి క్షేత్రం'. ప్రాచీన వైభవాన్ని ... చారిత్రక నేపథ్యాన్ని కలిగివున్న ఈ క్షేత్రం, కర్ణాటక లోని 'మురుగమలె'లో దర్శనమిస్తుంది. కైలాసనాథుడు ఇక్కడి కొండపై కొలువుదీరి కనిపిస్తాడు. పూర్వం 'భరద్వాజ మహర్షి' సదాశివుడు గురించి తపస్సు చేయగా ఆ స్వామి ప్రత్యక్షమై , మహర్షి అభ్యర్ధన మేరకు ఇక్కడే కొలువైనట్టు స్థలపురాణం చెబుతోంది.
'సప్త రుషులు'ఇక్కడి స్వామిని ఆరాధించి ఆయన అనుగ్రహాన్ని పొందారు. ఆ తరువాత కాలంలో అర్జునుడు కూడా ఇక్కడి స్వామిని దర్శించి పూజించాడని అంటారు. ఎటు చూసినా కొండలు ... గుట్టలు కనిపిస్తున్నప్పటికీ, ఈ క్షేత్రంలో కోనేరు వుండటం ... అంతర్వాహినిగా గంగ ప్రవహిస్తూ వుండటం విశేషంగా చెబుతుంటారు. అంతర్వాహినిగా ప్రవహిస్తున్న గంగా జలాన్ని తీర్థంగా స్వీకరించడం వలన చర్మవ్యాధులు నశిస్తాయని అంటారు. ఇక గర్భాలయంలో స్వామివారికి ఎదురుగా రెండు నందులు కొలువుదీరి కనిపిస్తుంటాయి. కొంత దూరం నందిపై ... మరి కొంత దూరం భ్రుంగిపై ప్రయాణించి శివుడు ఇక్కడికి చేరుకోవడమే ఇందుకు కారణమని అంటారు.
గర్భాలయంలో లింగరూపంలో నెలవైన స్వామి మహా తేజస్సుతో వెలిగిపోతుంటాడు. ఇక ఇదే ప్రాంగణంలో పార్వతీ దేవి ... గణపతి ... సుబ్రహ్మణ్య స్వామి ... నవగ్రహాలతో పాటు భరద్వాజ మహర్షి కూడా ప్రత్యేక మందిరాలలో కొలువై పూజలు అందుకుంటూ వుంటారు. ముక్తిని ప్రసాదించే ఇక్కడి స్వామిని పర్వదినాల సమయంలో అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శిస్తుంటారు ... స్వామి కృపా కటాక్షాలలో తరిస్తుంటారు.