గోవర్ధన గిరిధారి క్షేత్రం
శ్రీ కృష్ణుడి బాల్య క్రీడలు ... ఆయన లీలా విశేషాలను గురించి ఎంత చదివినా చదవాలనిపిస్తుంది. ఎంత విన్నా వినాలనిపిస్తుంది. దుష్ట శిక్షణ ... శిష్ట రక్షణ కోసం ఆయన అవతరించినా, ఆ నేపథ్యంలో ఆయన ముందుకి సాగినతీరు ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది. వివిధ ప్రదేశాల్లో ఆయన ఆవిర్భవించిన తీరు కూడా అంతే ఆసక్తిని రేకెత్తిస్తూ వుంటుంది. అలాంటి నేపథ్యంతో ఆయన కొలువుదీరిన క్షేత్రం రాజస్థాన్ - నాథ్ ద్వారా లో దర్శనమిస్తుంది.
అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రంలో స్వామి బాలకృష్ణుడిగా కొలువై ఉంటాడు. మూలమూర్తి గోవర్ధనగిరిని ఎత్తిన భంగిమలో వుంటుంది కనుక, స్వామిని అంతా గోవర్ధన గిరిధారి' గా కొలుస్తుంటారు. మధుర సమీపంలోని గోవర్ధనగిరి దగ్గరే వల్లభాచార్యకి ఈ ప్రతిమ లభించగా అక్కడే దానిని ప్రతిష్ఠించాడు. ఆ తరువాత ఆలయాలపై మతపరమైన దాడులు జరుగుతున్న సందర్భంలో ఈ ప్రతిమ ఈ ప్రాంతానికి చేర్చబడినట్టు స్థల పురాణం చెబుతోంది.
ఇక్కడి ప్రజలు శ్రీ కృష్ణుడే తమ నాయకుడు ... ఆయనే తమ దేవుడు అని బలంగా విశ్వసిస్తుంటారు. ఆ దైవం తమని చూసుకుంటున్నట్టుగానే వాళ్లు కూడా ఆయనకి ఏ లోటూ రానీయకుండా చూసుకుంటూ వుంటారు. బాలకృష్ణుడికి వివిధ రకాల అలంకారాలు చేస్తూ, సుందర సుకుమారమైన ఆయన రూపాన్ని చూస్తూ మురిసిపోతుంటారు. ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను ప్రేమతో సమర్పిస్తూ మైమరచిపోతుంటారు.
ఏడాది పొడవునా ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగానే వుంటుంది. ఇటు పురాణ సంబంధమైన నేపథ్యం ... అటు చారిత్రక పరమైన నేపథ్యంగల ఈ విశిష్టమైన క్షేత్రాన్ని దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.