చిన్న శ్రీశైలం
మహాశివుడిని మనసుతోనే గెలవాలి ... ఆ స్వామిని ఆర్తితోనే పిలవాలి. అప్పుడే ఆయన కరుణిస్తాడు ... వరదగా వరాలను ప్రసాదిస్తాడు. చల్లని మనసున్న ఆ చంద్రశేఖరుడు కొలువైన క్షేత్రం మనకి కృష్ణా జిల్లా 'తోట్ల వల్లూరు'లో దర్శనమిస్తుంది. ఈ క్షేత్రంలో శివుడు ... మల్లికార్జునుడుగా ... అమ్మవారు భ్రమరాంబికా దేవిగా కొలవబడుతుండటం వలన, ఇది కృష్ణా నదీ తీరంలో వుండటం వలన దీనిని 'చిన్న శ్రీశైలం' గా పిలుస్తుంటారు.
అతి ప్రాచీనమైన ఇక్కడి స్వామి క్రీ.శ.17 వ శతాబ్దంలో వెలుగుచూసినట్టు స్థలపురాణం చెబుతోంది. కాలక్రమంలో ఆలయం నిర్మించబడి దాతల సహాయ సహకారాలతో అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఆలయ ప్రాంగణంలో దక్షిణామూర్తి ... వీరభద్రుడు ... భద్రకాళి ... గణపతి ... సుబ్రహ్మణ్య స్వామి ... నవగ్రహాలు పూజలు అందుకుంటూ వుంటారు. ఇక గర్భాలయానికి ఎదురుగా కుదురుగా కూర్చుని కనిపించే నందీశ్వరుడిని 'జీవనంది' గా పిలుస్తుంటారు.
ఒకప్పుడు ఈ పరిసరప్రాంతాల్లోని పంటచేలు రోజుకి కొన్ని ఎకరాల మేర పాడవసాగాయి. ఎవరివో ఎద్దులు రాత్రివేళలో చేలల్లో పడి ఇలా చేస్తున్నాయని గ్రామస్తులు భావించి, ఒక రాత్రివేళ కాపుకాసారు. ఓ రాత్రివేళ ఓ ఎద్దు పంటచేలల్లోకి ప్రవేశించడం గమనించారు. వారు దానిని తరమడంతో అది పరిగెత్తుకుని గుడిలోకి వచ్చి శివయ్య ఎదురుగా కూర్చుని శిలగా మారిపోవడం చూసి ఆశ్చర్య పోయారు.
ఆ తరువాత ఆ నంది పంటపొలాలు పాడుచేయకుండా, అది జీవంతో వుండగా ఓ సాధువు దాని కాలు పైకెత్తి మంత్రించిన కడియం తొడిగాడని చెబుతారు. నంది మడచిన కాలుకి ఎక్కడా అతుకులేని ఆ కడియం అమరి వుండటం చూస్తే ఈ కథంతా నిజమేనని అనిపించక తప్పదు. శివయ్యతో పాటు భక్తులు నందిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు.
ప్రతి ఏడాది శివరాత్రి సందర్భంగా ఇక్కడ అయిదు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. భ్రమరాంబా మల్లికార్జునులను కనులారా దర్శిస్తూ ... మనసారా స్మరిస్తూ పునీతులవుతుంటారు.