స్వయంభువు చెన్నకేశవుడు
శ్రీ చెన్నకేశవ స్వామి ఆవిర్భవించిన అతి ప్రాచీనమైన క్షేత్రాలలో 'కౌతరం' ఒకటిగా ప్రసిద్ధి చెందింది. మహిమాన్వితమైన ఈ క్షేత్రం మచిలీపట్నం సమీపంలో అలరారుతోంది. స్థల పురాణాన్ని బట్టి ఇక్కడి చెన్న కేశవుడు క్రీ.పూ. 2000 సంవత్సరాల క్రితమే పూజలు అందుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ తరువాత చాలా సార్లు శిధిలమైన స్వామివారి ఆలయం, పునఃనిర్మాణాలు జరుపుకుంటూ వచ్చింది.
రాజరాజ నరేంద్రుడి కాలంలో శత్రువులపై దండయాత్ర చేసేందుకు ఆయన బయలుదేరాడు. ఈ ప్రదేశానికి వచ్చే సరికి, తనకి విజయం లభిస్తే తన ఇలవేల్పు అయిన చెన్నకేశవస్వామికి ఇక్కడ ఆలయం నిర్మిస్తానని ఆయన అనుకున్నాడట. స్వామి అనుగ్రహంతో విజయం సాధించిన రాజరాజ నరేంద్రుడు, స్వామికి ఇచ్చిన మాట మరిచి 'కౌతరం' గ్రామం దాటబోతుండగా గుర్రం ఒక్కసారిగా ఆగిపోయింది.
ఆ రాత్రి అక్కడే విశ్రమించిన రాజు అసలు సంగతిని గ్రహించాడు. ఆ రాత్రే ఆయనకి కలలో స్వామి కనిపించి ... తన విగ్రహాల జాడను తెలియజెప్పి, వాటిని ఆలయంలో ప్రతిష్ఠించమని ఆదేశించాడట. మరునాడు ఉదయమే స్వామి చెప్పిన ఆనవాళ్ల ప్రకారం, శ్రీదేవి - భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ప్రతిమలను ఆయన కనుక్కుని వాటికి ఆలయాన్ని నిర్మించాడు. నాటి నుంచి స్వామివారికి నిత్య ధూప .. దీప .. నైవేద్యాలు జరుగుతున్నాయి. ఇక్కడి భక్తులు స్వామివారిని తమ ఇలవేల్పుగా భావించి పూజిస్తుంటారు.
ధనుర్మాసంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇక వైశాఖ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి కల్యాణోత్సవం ఘనంగా జరుగుతుంటుంది. ఈ సందర్భంగా అత్యధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. నేత్రపర్వంగా జరిగే స్వామివారి ఉత్సవాల్లో పాల్గొని తన్మయత్వంతో తరిస్తుంటారు.