జలధీశ్వర స్వామి క్షేత్రం
ప్రాచీన ఘనత ... ఆధ్యాత్మిక వైభవం కలిగిన పుణ్యక్షేత్రాలు, మనసును ప్రశాంత నిలయంగా మార్చి ముక్తి మార్గంలో నడిపిస్తుంటాయి. అలాంటి విశిష్టమైన పుణ్యక్షేత్రాల్లో 'జలధీశ్వరస్వామి క్షేత్రం' ఒకటిగా కనిపిస్తుంది. పురాణపరమైన నేపథ్యంగల ఈ క్షేత్రం కృష్ణా జిల్లా 'ఘంటసాల'లో దర్శనమిస్తుంది.
సిద్ధార్థుడు తనకెంతో ఇష్టమైన 'ఘంటక' మనే అశ్వం చనిపోగా, దాని పేరున ఇక్కడ ఒక స్థూపాన్ని ప్రతిష్ఠించాడనీ ... కాలక్రమంలో అదే 'ఘంటసాల' గా మారిందని శాసనాల వలన తెలుస్తోంది. వేల సంవత్సరాల క్రితమే స్వామి ఇక్కడ పార్వతీ సమేతుడై కొలువై వుండగా, క్రీ.శ.2 వ శతాబ్దంలో ఈ క్షేత్రం వెలుగులోకి వచ్చినట్టు ఆధారాలు చెబుతున్నాయి. చాళుక్యులు ... శాతవాహనులు ఆలయ అభివృద్ధిలో ప్రధాన పాత్రను పోషించారు.
ప్రాచీన వైభవానికి అద్దంపడుతోన్న ఈ క్షేత్రంలో, గర్భాలయంలో స్వామివారు ... అమ్మవారు ఏక పీఠంపై కొలువుదీరి వుంటారు. ఈ కారణంగానే దీనిని అర్థనారీశ్వర పీఠమని పేర్కొంటూ వుంటారు. ఆదిదంపతుల ఆదేశం మేరకే అగస్త్య మహర్షి ఇక్కడ వారిని ప్రతిష్ఠించినట్టు స్థలపురాణం చెబుతోంది. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రాన్ని ఒకసారి దర్శించడం వలన, అష్టాదశ శక్తి పీఠాలను ... ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించిన ఫలితం లభిస్తుందని అంటారు.
ఇక్కడ స్వామివారి అభిషేక తీర్థం సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. విశేషమైనటు వంటి పర్వదినాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు నిర్వహిస్తూ వుంటారు.ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, ఆది దంపతుల ఆశీస్సులను ... అనుగ్రహాన్ని పొందుతుంటారు.