శ్రీ సత్యనారాయణస్వామి క్షేత్రం
భక్తుల కష్టనష్టాలను తీర్చడం కోసం ... ఆపదల నుంచి అనారోగ్యాల నుంచి వారిని గట్టెక్కించడం కోసం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే సత్య దేవుడిగా అవతరించాడు. అలా స్వామి అన్నవరంలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో కొలువై నిత్య పూజలు అందుకుంటున్నాడు. విశాఖపట్నంలోని ఇసుకకొండపై కూడా సత్యదేవుడు నెలవై భక్తులను అనుగ్రహిస్తున్నాడు.
రెండు వందల సంవత్సరాల క్రితం ఒక భక్తుడు స్వామివారి ఆదేశం మేరకు ఇక్కడ ఆలయం నిర్మించినట్టు చెబుతున్నారు. విశాలమైన ఆలయ ప్రాంగణం ... అందమైన రాజగోపురం ... పవిత్రతకు ప్రతీకగా కనిపించే ముఖమంటపం ... ఆలయ వైభవాన్ని ఆవిష్కరిస్తూ వుంటాయి. గర్భాలయంలో స్వామివారు రమా సహితంగా దర్శనమిస్తుంటాడు. మొదట పాలరాతి విగ్రహాలను ... ఆ తరువాత నల్లరాతి విగ్రహాలను ప్రతిష్ఠించడం వలన గర్భాలయంలో రెండు జతల మూలమూర్తులు కొలువుదీరి వుంటాయి.
ఇక ఆలయ ప్రాంగణంలోనే లక్ష్మీదేవి ... గోదాదేవి ... ఆంజనేయస్వామి కూడా పూజలు అందుకుంటూ వుంటారు. ఇక ఈ క్షేత్రంలో సత్యనారాయణస్వామి వ్రతాలు సామూహికంగా జరుగుతూ వుంటాయి. భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఇక్కడ పంచ పౌర్ణమి దీక్షను తీసుకుంటూ వుంటారు. చైత్ర .. వైశాఖ ... ధనుర్మాసాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి.
ఇక జ్యేష్ట మాసంలో జరిగే స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవానికి భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తుంటారు. ఆహ్లాదకరమైన ఈ క్షేత్రంలో కొండపై కొలువుదీరిన సత్యదేవుడు, సుఖసంతోషాలను ప్రసాదిస్తాడని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.