సంపదలిచ్చే శివపూజ
శివార్చన చేయడానికి భక్తి శ్రద్ధలే తప్ప ఎలాంటి ఖర్చూఅవసరం వుండదు. శివలింగాన్ని నీటితో అభిషేకించి, బిల్వ దళాలను సమర్పిస్తే చాలు ఆయన సంబరపడిపోతాడు ... సంతోషంతో పొంగిపోతాడు. సాధారణంగా నల్లరాయి ... తెల్లరాయితో చేసిన శివలింగాలను, వెండి ... బంగారు ... స్పటిక శివలింగాలను పూజిస్తూ వుంటారు.
వీటిలో ఒక్కో శివలింగానికి ఒక్కో ప్రత్యేకత ... విశిష్టత వున్నాయి. వీటిని పూజించడం వలన వివిధ రకాల ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని అవసరాలను తీర్చే శక్తి ధనానికి వుంది కనుక, ఏ శివలింగాన్ని ఎలా పూజిస్తే సంపదలు కలుగుతాయనే విషయంలో చాలా మందిలో సందేహాలు తలెత్తుతుంటాయి. అలాంటి వారికి సమాధానంగా శాస్త్రాలు చాలా తేలిక పద్ధతిని సూచిస్తున్నాయి.
స్త్రీలు మట్టితో చేసిన శివలింగాన్ని ... పురుషులు రాయితో చేసిన శివ లింగాన్ని పూజించడం వలన ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. రాగిచెంబులోని నీటిలోకి సమస్త నదుల నీటిని ఆవాహన చేసి, ఆ నీటితో అభిషేకం చేయాలని అంటున్నాయి. ఈ విధంగా ఒక మండలం పాటు చేయడం వలన దారిద్ర్య బాధ తొలగిపోయి సంపదలు కలుగుతాయని స్పష్టం చేస్తున్నాయి. ఎంత భక్తి శ్రద్ధలతో ... మరెంత నియమనిష్టలతో ఈ అభిషేకం చేస్తామో అంతే వేగంగా ఫలితం ఉంటుందని తెలియజేస్తున్నాయి.