బ్రహ్మ కపాలం
బదరీ వెళ్లిన వారు 'బ్రహ్మ కపాలం' అనే ప్రదేశంలో పితృకార్యాలు నిర్వహిస్తూ వుంటారు. ఇక్కడ పితృ కార్యాలు జరపడం వలన, వారికి నరక బాధల నుంచి విముక్తి కలుగుతుందని చెబుతుంటారు. ఈ కారణంగానే ఈ క్షేత్రంలో పితృకార్యాలు నిర్వహిస్తూ, వారికి పుణ్య లోకాలు కలిగేలా చేస్తుంటారు. అయితే ఈ క్షేత్రం ఇక్కడ ఆవిర్భవించడానికి ... దీనికి ఈ పేరు రావడానికి వెనుక పురాణ సంబంధమైన కథ లేకపోలేదు.
పూర్వం తన ఆద్యంతాలు తెలుసుకోవలసిందిగా బ్రహ్మ - విష్ణులతో శివుడు చెప్పాడు. తల భాగం కనుక్కునే దిశగా వెళ్లిన బ్రహ్మకి, అది అసాధ్యమని తెలిసి వెనుదిరిగి వచ్చి తాను కనుక్కున్నట్టు శివుడితో చెబుతాడు. ఆయన అబద్ధం చెప్పడంతో కోపించిన శివుడు, అసత్య దోషానికి ఫలితం అనుభవించమంటూ భైరవుడిని సృష్టిస్తాడు. బ్రహ్మ తన పంచ ముఖాలలో ఏ ముఖంతో అయితే అసత్యమాడాడో, ఆ ముఖాన్ని తీసివేయవలసిందిగా ఆదేశిస్తాడు.
రుద్రుడి ఆదేశాన్ని అక్షరాలా అమలుపరిచిన భైరవుడు, బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడే మార్గాన్ని సూచించమని శివుడిని కోరతాడు. బ్రహ్మ తల ఎక్కడైతే పడిందో ... ఆ ప్రదేశాన్ని దర్శించడం వలన ఆ పాపం తొలగిపోతుందని చెబుతాడు శివుడు. అలా బ్రహ్మ తల పడిన ప్రదేశమే 'బ్రహ్మకపాలం'గా ప్రసిద్ధిచెందింది. ఆ తరువాత బ్రహ్మ దేవుడు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయగా, ఆయన తల పడిన ప్రదేశం పితృకార్యాలకు ప్రసిద్ధి చెందుతుందని వరాన్ని అనుగ్రహిస్తాడు శివుడు.
ఆనాటి నుంచి బ్రహ్మ కపాలంలో పితృకార్యాలు విరివిగా నిర్వహించబడుతూ వస్తున్నాయి. బ్రహ్మకపాలం పితృదేవతలను పుణ్య లోకాలకు తరలించడమే కాకుండా, ఇక్కడ ఎవరైతే పితృకార్యాలను నిర్వహిస్తారో వారి దోషాలను కూడా నశింపజేస్తుందని స్థలపురాణం చెబుతోంది.