స్వామి పుష్కరిణి విశిష్టత
భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమలలో 'స్వామి పుష్కరిణి' అత్యంత విశిష్టమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ సమస్త విశ్వంలోని సకల తీర్ధాలకంటే ఇది పవిత్రమైనది కావడం వలన, ఇందులో స్వామివారికి తెప్పోత్సవం జరపడం వలన దీనిని స్వామి పుష్కరిణి అని అంటారు. వైకుంఠంలోని ఈ పుష్కరిణిని స్వామి వారి ఆదేశంతో గరుత్మంతుడు ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
ఈ కారణంగానే ఈ పుష్కరిణిలోని నీటిని తీర్థంగా స్వీకరించడం వలన, ఇందులో ఒకసారి స్నానం చేయడం వలన ఉత్తమగతులు కలుగుతాయని చెబుతుంటారు. అత్యంత మహిమాన్వితమైన ఈ పుష్కరిణిలో స్నానమాచరించడం వలన అనేక రకాల వ్యాధులు తొలగిపోతాయనీ, సకల సంపదలు చేకూరతాయని అంటారు. ఇక ఈ పుష్కరిణిలో స్నానంచేస్తూ ఎవరు ఏదైతే కోరుకుంటారో అది తప్పక నెరవేరుతుందనడానికి నిదర్శనాలు వున్నాయి.
త్రేతాయుగంలో దశరథ మహారాజు ఈ పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని పూజించిన కారణంగానే, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఆయన కుమారుడైన శ్రీ రామచంద్రుడిగా జన్మించాడని అంటారు. ఇక తారకాసుర సంహారం అనంతరం, ఆ పాపాన్నుంచి బయటపడే మార్గం గురించి చెప్పమని పార్వతీ పరమేశ్వరులను కుమార స్వామి అడుగుతాడు. తిరుమల క్షేత్రంలోని స్వామి పుష్కరిణిలో స్నానం చేయడం వలన బ్రహ్మ హత్యా పాతకం నుంచి బయటపడొచ్చని వారు సమాధానమిచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఆ ప్రకారం కుమారస్వామి స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి ఆ పాపం నుంచి విముక్తి పొందాడు.
ఆ తరువాత యుగాల్లోనూ ఎందరో మహర్షులు ... రాజవంశీకులు ... మరెందరో మహాభక్తులు ఈ పుష్కరిణిలో స్నానం చేయడం వలన స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారని చరిత్ర చెబుతోంది. ఇంతటి పవిత్రమైన ఈ పుష్కరిణిలో స్నానం చేసిన వారు మాత్రమే కాకుండా, వారి పూర్వీకులు కూడా సమస్త పాపాల నుంచి విముక్తి పొందుతారని అంటారు.