శ్రీ ఆంజనేయ ఆలయం
అత్యంత ప్రాచీనమైన ... విశిష్టమైన ఆంజనేయస్వామి క్షేత్రాలలో 'లక్నో' నగరం ఒకటిగా భాసిల్లుతోంది. ఇక్కడ హనుమంతుడికి రెండు ఆలయాలు వుండటం విశేషంగా చెప్పుకుంటూ వుంటారు. గతంలోని ప్రాచీన ఆలయం మతపరమైన దాడులలో దెబ్బతినగా, దాని పక్కనే మరో ఆలయం నిర్మించారు. ఇది కూడా చాలా కాలం కిందటే నిర్మించబడింది.
ఇక్కడ ఆంజనేయ స్వామి క్షేత్రం ఆవిర్భవించడం వెనుక పురాణపరమైన కథనమే కాకుండా, చారిత్రక పరమైన కథనం కూడా వినిపిస్తూ వుంటుంది. త్రేతాయుగంలో హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకువస్తూ కాసేపు ఇక్కడ ఆగాడనీ, ఆయన పాదస్పర్శ తో ఈ ప్రదేశం పవిత్రమైందని స్థలపురాణం చెబుతోంది.
ఆ తరువాత కాలంలో ఈ ప్రాంతానికి చెందిన ఓ భక్తుడికి కలలో స్వామి కనిపించి, తాను రావిచెట్టు తొర్రలో ఉన్నట్టుగా చెప్పి తనని ప్రతిష్ఠించమని కోరాడట. ఆ భక్తుడు స్వామి వారి ఆదేశం ప్రకారం ఆ ప్రతిమను ఇక్కడ ప్రతిష్ఠించాడు. నాటి నుంచి ఈ క్షేత్రానికి భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. విశాలమైన ఆలయంలో రామాయణానికి సంబంధించిన దృశ్యాలు చిత్రించబడి వుంటాయి.
ఆలయ ప్రాంగణంలో సీతారాములు ... రాధా కృష్ణులు ... శివుడి మందిరాలు దర్శనమిస్తాయి. అలాగే దుర్గాదేవి ... సరస్వతీ దేవి ... గాయత్రీ దేవి ... సంతోషిమాత ... మహాకాళి కొలువుదీరి కనిపిస్తుంటారు. స్వామివారికి భక్తులు పండ్లు ... తీపిపదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఇక్కడి స్వామిని పూజించడం వలన ఆపదలు ... అనారోగ్యాలు తొలగిపోతాయనీ, సంపదలు శుభాలు కలుగుతాయని భక్తులు చెబుతుంటారు. అందుకు నిదర్శనాలను కూడా చూపుతుంటారు.
స్వామివారికి తమ కోరికలను మనవి చేసుకున్న భక్తులు, అవి నెరవేరగానే ఆలయ ప్రాంగణంలో గంటలు కట్టడం ఆనవాయతీగా వస్తోంది. అలా కట్టబడిన కొన్ని వేల గంటలు ఇక్కడ కనిపిస్తుంటాయి. మంగళ వారాల్లోను ... పర్వదినాల్లోను ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది.