నయనాలప్ప క్షేత్రం
శివుడి పట్ల అసమానమైన ప్రేమానురాగాలను ప్రదర్శించిన తిన్నడు, భక్తితో ఆయనకు కళ్లను అప్పగించి భక్త కన్నప్పగా చరిత్రలో నిలిచిపోయాడు. అలాగే మరో భక్తుడు కూడా తాను పాపం చేసినట్టుగా భావించి, అందుకు కారణమైన కళ్లను పెకిలించుకుని శివయ్య పాదాల చెంత ఉంచాడు. అదే 'నయనాలప్ప' క్షేత్రంగా నేడు అలరారుతోంది.
ఈ క్షేత్రం కర్నూలు జిల్లా అక్కంపల్లి సమీపంలో విలసిల్లుతోంది. పూర్వం చెన్నబసప్ప అనే భక్తుడు తన భార్యా బిడ్డలతో కలిసి ఈ దారిలో వెళుతూ, చీకటి పడటంతో ఈ ప్రదేశంలో విశ్రమించాడు. అప్పుడు ఆయన కలలో శివుడు కనిపించి, అక్కడ తన ఆలయాన్ని నిర్మించవలసిందిగా కోరాడట. స్వామి ఆదేశం మేరకు గ్రామస్తుల సహాయ సహకారాలతో చెన్న బసప్ప ఆలయం నిర్మించి, ఓంకారేశ్వరుడిగా స్వామికి నామకరణం చేశాడు.
ఆ తరువాత కాశీ నుంచి గంగాజలం తీసుకు వచ్చి స్వామిని అభిషేకించాలానే ఉద్దేశంతో, ఎడ్లబండిపై బయలుదేరాడు. అలా కాశీ వెళ్లిన చెన్న బసప్ప కొన్ని సంవత్సరాలకి తిరిగివచ్చాడు. ఈలోగా యవ్వనంలోకి అడుగు పెట్టిన ఆయన కూతురు అచ్చు తల్లి పోలికలను సంతరించుకుంది. సమయానికి తల్లి ఇంట్లో లేకపోవడంతో, సంతోషంగా తండ్రికి ఎదురు వెళ్లింది.
ఆ వచ్చినది తన భార్యే అనుకున్న బసప్ప, ఆ తరువాత కూతురని తెలిసి మానసికక్షోభ అనుభవించాడు. తన కళ్ళే తనని తప్పుదారి పట్టించాయని భావించిన బసప్ప, తన కనుగుడ్లను పెరికివేసుకుని వాటిని శివుడి పాదాల చెంత ఉంచాడు. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి 'నయనాలప్ప' అనే పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది. బసప్ప అంధుడిగానే కొంతకాలం పాటు స్వామిని సేవించి, ఆ తరువాత జీవసమాధి చెందాడు.
దేవాలయ నిర్మాణంలోను ... కాశీ వెళ్ళిరావడంలోను యజమానికి సహకరించిన ఎద్దులు కూడా అదే రోజున తనువు చాలించాయి. ఆలయ సమీపంలో ఆ ఎద్దుల సమాధి మందిరం కూడా కనిపిస్తూ వుంటుంది. కొండపైగల గుహపై నిర్మించబడిన ఈ ఆలయం ఎంతో విశిష్టమైనదిగా చెబుతుంటారు. గుహలోని శివలింగం చాలా ప్రాచీనమైనదని అంటారు. ఈ శివలింగానికి కూడా పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఈ ఆలయంలో విభూతి పండ్ల గది వుండటం విశేషంగా చెబుతుంటారు.
ఆలయ ప్రాంగణంలో పార్వతీ దేవి ... గణపతి ... నాగదేవత ... నవగ్రహాలు పూజలు అందుకుంటూ వుంటారు. సంతానాన్ని అనుగ్రహించే స్వామిగా ఇక్కడి శివయ్య ప్రసిద్ధి చెందాడు. పర్వదినాల సమయంలో వివిధ ప్రాంతాలకి చెందిన భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శిస్తుంటారు ... ధన్యులవుతుంటారు.