కార్తీకస్నాన ఫలితం
కార్తీక స్నానం ఒక వ్రతంలా ఆచరించడం వలన, విశేషమైన పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా 'దీపావళి' వెళ్లిన మరుసటి రోజు నుంచే కార్తీక స్నానాలు ఆచరిస్తూ వుంటారు. దసరా నవరాత్రుల సమయంలో అంటే ఆశ్వీయుజ శుద్ధ దశమి నుంచే కార్తీక స్నాన వ్రతం ఆరంభించవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఇక కార్తీక స్నానాలు వీలైనంత వరకూ నదుల్లో చేయడం శ్రేష్టం. నదీ ప్రాంతాలకు దూరంగా వుండేవారు చెరువులు ... సరస్సులలో గానీ, బావి నీటితోగాని స్నానం చేయవచ్చు. కార్తీక స్నానం ఎప్పుడూ కూడా సూర్యుడు ఉదయించడానికి గంటన్నర ముందుగా అంటే , నక్షత్రాలు కనిపిస్తూ ఉండగానే చేయాలి. సూర్యుడు ఉదయించేలోగానే దీపారాధనలు ... పూజలు పూర్తికావాలి.
ఇక ప్రతి రోజూస్నానం చేస్తున్నప్పుడు, కార్తీక దామోదరుడిని స్మరిస్తూ వుండాలి. కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేయడం దోషమని శాస్త్రం చెబుతోంది. అందువలన శాస్త్రం సూచించిన నియమాలను పాటిస్తూ కార్తీక స్నాన వ్రతం పూర్తి చేయడం వలన ఆరోగ్యంతో పాటు, విశేషమైన పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయనే విషయాన్ని మరిచిపోకూడదు.