వడ్డన చేసిన పాండురంగడు
పురందరదాసు అనునిత్యం ... అనుక్షణం పాండురంగస్వామిని కీర్తిస్తూ ... సేవిస్తూ ఉండేవాడు. ఒకసారి ఆయన ఆ స్వామి దర్శనానికి వచ్చిన పేదలకు అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా పూర్తిచేశాడు.
స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులంతా భోజనానికి కూర్చుంటూ వుండగా, నెయ్యి లేకపోవడాన్ని పురందరదాసు గమనించాడు. వెంటనే 'అప్పన్న'అనే భక్తుడిని పిలిచి ... ఫలానా వాళ్లు నెయ్యి పంపిస్తామని చెప్పారనీ, వెంటనే వెళ్లి తీసుకురమ్మని చెప్పాడు. అలాగే నంటూ అక్కడి నుంచి పరుగులాంటి నడకతో బయలుదేరాడు అప్పన్న. అలా వెళ్లిన అప్పన్న వెంటనే తిరిగి రావడం ... ఘుమఘుమలాడే నెయ్యిని అందరి విస్తళ్లలో వడ్డిస్తూ వుండటం చూసి పురందరదాసు సంతోషించాడు.
అందరూ కడుపునిండా భోజనం చేసి ... ఆశీర్వదిస్తూ వెళ్లడం పురందరదాసుకి ఎంతో సంతృప్తిని కలిగించింది. అన్నదాన కార్యక్రమం పూర్తి అయిన తరువాత పురందరదాసు అక్కడి నుంచి బయలుదేరదామని అనుకుంటూ వుండగా, హడావిడిగా అప్పన్న అక్కడికి వచ్చాడు. అప్పన్న చేతిలో నెయ్యి పాత్రను చూసిన పురందరదాసు అదంతా మిగిలిపోయిన నెయ్యిగా భావించి, మరికాస్త ఎక్కువగా వడ్డించవలసిందని అన్నాడు. ఆ మాటకు అయోమయానికి గురైన అప్పన్న సమయానికి అందుకోలేకపోయినందుకు తనని మన్నించమంటూ కోరాడు.
అప్పన్న అలా అనడంతో పురందరదాసు ఆశ్చర్యపోయాడు. అతను అందరికీ నెయ్యి వడ్డిస్తూ వుండటాన్ని తాను చూశానని అన్నాడు. తాను వస్తున్నది ఇప్పుడేననీ, అనివార్య కారణాల వలన ఆలస్యమైందని చెప్పాడు అప్పన్న. అతని రూపంలో సాక్షాత్తు ఆ పాండురంగడే వచ్చి నెయ్యి వడ్డించాడనే విషయం పురందరదాసుకి అర్థమైంది. ఆ స్వామిచే నెయ్యి వడ్డన చేయించుకున్న వారు ధన్యులయ్యారనీ, తన జీవితం చరితార్థమైనదని పురందరదాసు పులకించిపోయాడు ... ఆ స్వామి లీలావిశేషాన్ని పదేపదే తలచుకుంటూ పరవశించిపోయాడు.