మహా దండేశ్వర క్షేత్రం
మహర్షులు ప్రతిష్ఠించిన శివలింగాలు మరింత మహిమాన్వితమైనవిగా ప్రసిద్ధి చెందాయి. వారు తపోభూమిగా ఎంచుకున్న ప్రదేశాలు నేడు పుణ్య క్షేత్రాలుగా అలరారుతున్నాయి. అలా మహర్షుల పాద ధూళిచే పవిత్రమై ... వారు ప్రతిష్ఠించిన శివలింగాల కారణంగా విశిష్టమైనవిగా వెలుగొందుతోన్న పుణ్య క్షేత్రాలులో 'ప్రత్తిపాడు' ఒకటిగా కనిపిస్తుంది.
గుంటూరు జిల్లాలోని ఈ క్షేత్రంలో పూర్వం 'గౌతమ మహర్షి' తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఈ ప్రదేశంలో ఆయన శివలింగాన్ని ప్రతిష్ఠించి 'మహా దండేశ్వరస్వామి' గా నామకరణం చేసి పూజాభిషేకాలు నిర్వహించేవాడు. ఆయన తరువాత ఈ శివలింగం గజపతుల కాలంలో పూజలు అందుకుంది.
గజపతుల మంత్రిగా పనిచేసిన గోపరాజు రామన్న స్వామికి ఆలయాన్ని నిర్మించాడు. ఆ తరువాత ఈ ఆలయం శిధిలావస్థకు చేరుకోగా, కాణిపాక పాలకుడైన కుసుమరాజు ఈ శివలింగాన్ని పునఃప్రతిష్ఠ చేశాడు. స్వామివారి నిత్య దీప ... ధూప .. నైవేద్యాలకు లోటురాకుండా శాసనాలు చేశాడు. ఆ తరువాత కాలంలో శ్రీ కృష్ణ దేవరాయల సోదరుడైన సదాశివరాయలు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించాడు.
అటు ఘన చరిత్రగల రాజులను ... ఇటు సామాన్య ప్రజలను ఈ స్వామి అనేక గండాల నుంచి బయటపడేశాడని చెబుతుంటారు. తమని కరుణించి కాపాడే దైవమంటూ భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు.