శ్రీకాకుళం
పురాణాలను పరిశీలిస్తే దేవతలు సైతం పాపపరిహారార్థం వివిధ ప్రాంతాల్లో శివలింగాలను స్థాపించిన సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఆ కోవలో ఏర్పడినదే 'ఉమా రుద్రకోటేశ్వర స్వామి' క్షేత్రం. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం శ్రీకాకుళంలో నాగావళి నదీ తీరంలో దర్శనమిస్తుంది.
మహాభారత యుద్ధం తరువాత మానసిక ప్రశాంతతను పొందడం కోసం 'బలరాముడు' వివిధ ప్రాంతాల్లో పంచాలింగాలను ప్రతిష్ఠించాడు. వాటిలో ఒక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి పూజించినట్టు స్థలపురాణం చెబుతోంది. ఇక్కడి నాగావళి నది బలరాముడి 'నాగలి' కారణంగా ఏర్పడిందని తెలుస్తోంది. ఈ క్షేత్రంలో నందీశ్వరుడిపై దాడి చేసి శక్తులు కోల్పోయిన ఇంద్రుడు, తిరిగి ఆ శక్తులను పొందడం కోసమే 'అరసవల్లి' లో సూర్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించినట్టు పురాణగాధ.
ద్వాపరయుగంలో నిర్మించబడిన ఇక్కడి ఆలయం ఇప్పటికీ చెక్కుచెదరక దర్శనమిస్తుంటుంది. గర్భాలయంలో స్వామివారు నాగాభరణాన్నిధరించి కనిపిస్తారు. ఉమాసహితంగా పూజలందుకుంటోన్న కారణంగా ఇక్కడి స్వామివారిని 'ఉమా రుద్రకోటేశ్వర స్వామి' గా ప్రసిద్ధి చెందాడు. స్వామివారికి ఎదురుగా ఆరు అడుగుల నందీశ్వరుడు, ద్వారపాలకులుగా శృంగి - భ్రుంగి కొలువుదీరి వుంటారు.
ఆలయ ప్రాంగణంలో పరివార దేవతలుగా శ్రీ రాజరాజేశ్వరీ దేవి ... మహా గణపతి ... హనుమంతుడు ... కోదండ రామస్వామి ... సుబ్రహ్మణ్య స్వామి మందిరాలు కొలువుదీరి కనిపిస్తుంటాయి. వేణుగోపాల స్వామి క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రానికి భక్తుల తాకిడీ బాగానే వుంటుంది. కార్తీక మాసంలోను ... శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు ... విశేష ఉత్సవాలు జరుగుతుంటాయి.
ద్వాపరయుగం నాటి నుంచి ఈనాటి వరకూ ఈ క్షేత్రానికి ఇంద్రాది దేవతలు వచ్చి స్వామివారిని పూజిస్తూ వుంటారని భక్తులు విశ్వసిస్తుంటారు. స్వామివారిని తమ ఇలవేల్పుగా భావించి అనునిత్యం ఆరాధిస్తూ ... స్మరిస్తూ ... సేవిస్తుంటారు.