మాలధారణ
సాధారణంగా 'మాలధారణ' అనేది మనసు పవిత్రంగా ఉండటానికి ... ఆచరించవలసిన నియమ నిష్టలను అనుక్షణం గుర్తు చేయడానికి జరుగుతుంటుంది. మండలం పాటు దీక్ష తీసుకుని మాలధారణ చేయడంలోని ఉద్దేశం ఇదే. దీక్షతో సంబంధం లేకపోయినా కొందరు మాలలను ధరిస్తూ వుంటారు. వారి వారి ఇష్టాన్ని బట్టి కొందరు రుద్రాక్ష మాలలు వాడితే, మరి కొందరు స్పటిక మాలలు ఉపయోగిస్తుంటారు. అయితే ఈ మాలలు ఎలా పడితే అలా కాకుండా, దైవారాధనను బట్టి మాలలు ధరించడం వలన సత్వర ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
విష్ణుమూర్తిని పూజించే వారు 'తులసి మాల'ను ... శివుడిని ఆరాధించే వారు 'రుద్రాక్ష మాల'ను ... లక్ష్మీ దేవిని పూజించే వారు 'తామర మాల'ను ... దుర్గను కొలిచే వారు 'ముత్యాల మాల' ను ... కృష్ణుడిని పూజించే వారు 'ఎర్ర చందన మాల' ను ... వినాయకుడిని కొలిచే వారు 'స్పటిక మాల' ను ... సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే వారు 'పగడాల మాల' ను ... ఇక నవగ్రహాలను పూజించే వారు 'నవరత్న మాల' ను ధరించాలనే విషయాన్ని శాస్త్రం ప్రస్తావిస్తోంది. ఈ నియమాన్ని ఆచరించడం వలన కోరిన కోరికలు వెంటనే నెరవేరతాయని చెబుతోంది.