‘RAW NTR’ సంస్థతో ఎలాంటి సంబంధం లేదు: జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ క్లారిటీ
- ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘RAW NTR’
- ఎన్టీఆర్ తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు ఆ సంస్థకు లేదన్న తారక్ కార్యాలయం
- అధికారిక వర్గాల నుంచి వెలువడే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచన
స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘RAW NTR’ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఆయన తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు ఆ సంస్థకు లేదని తెలిపింది. ఎన్టీఆర్ సేవా కార్యక్రమాల వివరాలు కేవలం ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడి అవుతాయని ప్రకటనలో స్పష్టం చేశారు.
‘RAW NTR’ సంస్థ ఎన్టీఆర్‌తో సంబంధం ఉన్నట్లు ప్రజల్లో భ్రమ కలిగించేలా వ్యవహరిస్తోందని ఆఫీస్ ఆందోళన వ్యక్తం చేసింది. అనధికారిక సంస్థలు, వ్యక్తుల ద్వారా జరిగే ప్రచారాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని అభిమానులు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేసింది.