అశ్వత్థామ
లోకంలో చిరంజీవులుగా చెప్పుకునే వారి జాబితాలో మనకి 'అశ్వత్థామ' పేరు కూడా కనిపిస్తుంది. హనుమంతుడు ... పరశురాముడు ... చిరంజీవులుగా వుండి పోవడానికి బలమైన కారణాలు వున్నాయి. అలాగే తాను కోరుకున్నప్పుడు మరణం సంభవించేలా వరాన్ని పొందిన అశ్వత్థామ, ఆ తరువాత సప్త రుషులలో ఒకరిగా నిలిచిపోయే వరాన్ని కూడా పొందాడు. అయితే శ్రీ కృష్ణుడిని ఎదిరించి సుధీర్గమైనటు వంటి ఈ కాలాన్ని ఆయన శాపగ్రస్తుడిగా గడపవలసి వచ్చింది.
ద్రోణ - కృపి దంపతులకు జన్మించిన అశ్వత్థామ మహాభారత యుద్ధంలో కీలకమైన పాత్రను పోషించాడు. యుద్ధం పూర్తి అయిన తరువాత కూడా అశ్వత్థామ ఆవేశం చల్లారలేదు. పాండవుల వంశం అంతరించేలా చేయాలనుకున్న అశ్వత్థామ, వాళ్లు విశ్రాంతి తీసుకుంటోన్న సమయంలో అత్యంత శక్తిమంతమైన ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. అది నేరుగా అభిమన్యుడి అర్థాంగి అయిన ఉత్తర గర్భస్థ శిశువును అంతం చేసే దిశగా వెళుతుండటాన్ని శ్రీ కృష్ణుడు గ్రహించాడు. గర్భస్థ శిశువులపై అస్త్ర ప్రయోగం అధర్మమనీ ... వెంటనే దానిని ఉపసంహరించమని కోరాడు శ్రీ కృష్ణుడు.
మహా పరాక్రమశాలి అయిన అశ్వత్థామ శ్రీ కృష్ణుడి మాటలను పట్టించుకోలేదు. ఆ అస్త్రం నేరుగా వెళ్లి ఉత్తర గర్భాన్ని తాకడంతో, శ్రీ కృష్ణుడు ఆగ్రహావేశాలకు లోనయ్యాడు. దుర్గంధ భరితమైన శరీరంతో ఆహారం కోసం అలమటిస్తూ మూడు వేల సంవత్సరాలు ఒంటరిగా సంచరించమంటూ అతణ్ణి శ్రీకృష్ణుడు శపించాడు. శాప విముక్తి అయిన తరువాత, సూర్య సావర్ణిక మన్వంతరంలో అశ్వత్థామ సప్తరుషులలో ఒకరిగా స్థానం సంపాదించుకోనున్నాడు.