తుల్జా భవాని
జగజ్జనని శక్తి స్వరూపిణి ... ఆమె తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతూ వుంటుంది. వారికి హాని కలిగించడానికి దుష్ట శక్తులు ప్రయత్నిస్తే అమ్మ ... ఆదిశక్తిలా మారుతుంది. త్రిమూర్తులు ఆగ్రహించినా వారిని శాంతపరచవచ్చునేమో గానీ, అమ్మ ఆగ్రహిస్తే ఆ త్రిమూర్తులు కూడా ఆమెను శాంతపరచలేరు. అందుకే అమ్మనే కాదు ఆమె బిడ్డలైన భక్తులను సమీపించడానికి కూడా దుష్ట శక్తులు భయపడుతుంటాయి.
శక్తి స్వరూపిణి అయిన అమ్మ ... మహారాష్ట్ర - ఉస్మానాబాద్ జిల్లా తుల్జాపూర్ లో వెలసింది. కొండపై నుండే ఈ అమ్మవారిని చూసుకునే ఆమె భక్తులు కొండంత ధైర్యంతో వుంటారు. ఇక్కడ అమ్మ అష్ట భుజాలతో 'భవాని'గా పూజలందుకుంటూ వుంటుంది. ఆలయ ప్రాంగణంలో మహాలక్ష్మి ... మహాకాళి ... మహా సరస్వతి కొలువుదీరి వుండటం వలన అమ్మ త్రిశక్తి స్వరూపిణిగా దర్శనమిస్తుంది. గోముఖం నుంచి వచ్చే నీరు ఈ క్షేత్రాన్ని మరింత పవిత్రం చేస్తుంటుంది.
ఛత్రపతి శివాజీ ఈ అమ్మవారి భక్తుడే. మొఘలాయిలతో యుద్ధానికి ముందు ఆయన అమ్మ దర్శనం చేసుకోగా ఆ దేవి ప్రత్యక్షమై మహా శక్తిమంతమైన ఖడ్గాన్ని ప్రసాదించిందని చరిత్ర చెబుతోంది. ఇక ఇక్కడ 'శిలంగణ' పేరుతో జరిగే దసరా ఉత్సవాలు చూసి తీరవలసిందే. ఈ సందర్భంలో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కుబళ్లు చెల్లిస్తూ వుంటారు.