పంచముఖ నారసింహుడు
శ్రీ మహా విష్ణువు ధరించిన దశావతారాలలో నృసింహ స్వామి అవతారానికి ప్రత్యేకత ప్రాధాన్యత వున్నాయి. సంకల్ప మాత్రం చేత అవతరించి, ఆ తరువాత భూమి పై కొంత కాలం మాత్రమే ఉన్న అవతారమిది. అయితే ఈ అవతారంలో భక్తులను అనుగ్రహించడం కోసం ఆయన అనేక ప్రాంతాల్లో వెలిశాడు. ఇలా అనేక అంశాలతో పలు ప్రదేశాల్లో వెలిసిన నరసింహ స్వామి, పంచ ముఖాలతో ... షోడశ భుజాలతో ఉగ్ర నరసింహ స్వామిగా 'నరసింహుల పల్లె' లో దర్శనమిస్తున్నాడు.
కరీంనగర్ - గంగాధర మండలంలోని ఈ గ్రామంలో నృసింహ స్వామి భక్తుల పాలిట కొంగు బంగారమై అలరారుతున్నాడు. పూర్వం రెక్కలు గల 'మలయ పర్వతం' ఆకాశ మార్గాన ప్రయాణిస్తుండగా, దానిలోని నాలుగు భాగాలు భూమిపై పడ్డాయట. ఆ పర్వత భాగాలే 'మంగళగిరి' ... 'వేదగిరి' ... 'యాదగిరి' ... 'నందగిరి' క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆ నందగిరిపైనే ఈ నరసింహుల పల్లె క్షేత్రం కొలువుదీరి కనిపిస్తుంది.
క్రీ.పూ.241 లో శాతవాహన రాజులు స్వామికి ఆలయాన్ని నిర్మించినట్టు ఆధారాలు వున్నాయి. 70 ఎకరాల విస్తీర్ణం గల ఈ క్షేత్రంలో కొండ గుహలో వెలసిన ఈ స్వామివారిని ఆ తరువాత వచ్చిన రాజులు దర్శించి తరించినట్టు శాసనాలు చెబుతున్నాయి. ఆది శంకరుల వారు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్టు ఆధారాలు కనిపిస్తున్నాయి.
ఇది అత్యంత శక్తి మంతమైన క్షేత్రంగా విష్ణు పురాణం ... బ్రహ్మ పురాణం పేర్కొన్నాయి. ప్రతియేటా చైత్ర శుద్ధ ఏకాదశి నుంచి స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో కొండంత దేవుడి అనుగ్రహంకోసం భక్తులు బారులుతీరతారు.