ప్రొద్దుటూరు
కడప జిల్లా ప్రొద్దుటూరులో వెలసిన ఆంజనేయ స్వామి, భక్తుల హృదయాలపై బలమైన ముద్ర వేశాడు. శ్రీ రామచంద్రుడు పొద్దుపొడవడానికి ముందే ఈ ప్రాంతంలో శివలింగ ప్రతిష్ఠ చేయడం వలన ఈ ఊరికి ఈ పేరు వచ్చిందని అంటారు. ఈ సమయంలో మహర్షుల కోరిక మేరకు తన మూర్తిని ప్రతిష్ఠించుకోమంటూ దానిని హనుమంతుడు వారికి ఇచ్చాడట. ఆ మూర్తిని పూజించిన వారికి తాను అండగా నిలుస్తానని చెప్పి రాములవారితో కలిసి వెళ్లి పోయాడు.
ఇక కలియుగంలో ఓ భక్తుడి కలలో హనుమంతుడు కనిపించి తన విగ్రహమూర్తి జాడ చెప్పి, దానిని తిరిగి ప్రతిష్ఠించమని చెప్పాడని స్థల పురాణం చెబుతోంది. ఆ భక్తుడు తన ఎడ్ల బండిని తీసుకుని స్వామి చెప్పిన ప్రదేశానికి చేరుకున్నాడు. ఆయన జాడ తెలుసుకుని బండిపై తీసుకుని తిరిగి వస్తుండగా, బండి ఒక ప్రదేశంలో ఆగిపోయిందట. ఎంతగా అదిలించినా ఎద్దులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయక పోవడంతో, స్వామి అక్కడే కొలువై వుండాలని నిర్ణయించుకున్నట్టుగా ఊరు పెద్దలు భావించారు. అంతా కలిసి శాస్త్రోక్తంగా ఆ ప్రదేశంలోనే స్వామి వారిని ప్రతిష్ఠించారు.
ఈ క్షేత్రానికి మంగళ .. శనివారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది. హనుమజ్జయింతి రోజున విశేష పూజలు ... ప్రత్యేక ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. దుష్ట శక్తులచే పీడించబడుతున్న వారు ... ఈ క్షేత్రంలోకి అడుగు పెట్టినంతనే మామూలు మనుషులవుతారని భక్తులు విశ్వసిస్తుంటారు.