పెద ముక్తేవి
కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో వెలసిన పంచ లక్ష్మీ నారాయణ స్వామి క్షేత్రాలలో 'పెదముక్తేవి' ప్రధాన క్షేత్రంగా చెప్పబడుతోంది. వీటిలో మొదటి మూడు క్షేత్రాలు (పెద ముక్తేవి .. అవనిగడ్డ .. నడికుదురు) కృష్ణా జిల్లాలో కొలువుదీరి కనిపిస్తాయి. ఇక మిగతా రెండు క్షేత్రాలైన నల్లూరు ... రాచూరు గుంటూరు జిల్లాలో కొలువుదీరాయి. ఈ అయిదు క్షేత్రాలు 'పంచ వైష్ణవ ఆరామాలు'గా ప్రసిద్ధిచెందాయి.
పెద ముక్తేవిలో వ్యాసమహర్షి ప్రతిష్ఠించిన శ్రీ రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీపతి స్వామివారు దర్శనమిస్తారు. కృష్ణా నదికి ఉపనది అయిన 'భీమానది' ఈ క్షేత్రాన్ని పావనం చేస్తూ వుంటుంది. వ్యాసమహర్షి తపస్సుకు మెచ్చిన శ్రీ మహా విష్ణువు ఆయన ప్రార్ధన మేరకు ఇక్కడ శ్రీ లక్ష్మీపతిగా స్వయంభువుగా వెలిసినట్టు స్థలపురాణం చెబుతోంది.
స్వామివారి చేతుల్లోని శంఖు చక్రాలు మార్పులు చెంది కనిపిస్తాయి. శంఖు .. చక్ర .. గద .. పద్మ ముద్రలతో స్వామివారు, కుడి చేతిలో పద్మం ... ఎడమ చేతిలో కుంకుమ భరిణెతో స్వామివారి ఎడమ తొడ పై అమ్మవారు దర్శనమిస్తుంటారు. సాధారణంగా విష్ణు క్షేత్రాలలో శివుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తుంటాడు. అలాంటిది ఈ క్షేత్రానికి పాలకుడిగా వినాయకుడు ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.
మతపరమైన దాడులలో ఇక్కడి స్వామివారి చేతిలోని 'సుదర్శన చక్రం' దెబ్బతినగా, దానిని సరిచేయడానికి అక్కడి వారు పూనుకునేలోగా, స్వామివారే స్వయంగా దానిని సరిచేశారని చెబుతారు. అందుకు నిదర్శనాన్ని కూడా వారు చూపిస్తుంటారు. విశేషమైన పర్వదినాల్లో ఇక్కడ జరిగే ఉత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటూ వుంటారు.