గణపతి కరుణ
ఎంతటి వారైనా ... ఏ శుభకార్యాన్ని ప్రారంభించాలన్నా అందుకు వినాయకుడి అనుగ్రహం వుండి తీరవలసిందే. గణాధిపత్యం నిర్వహిస్తున్నా ... సకల దేవతలు సైతం పూజిస్తున్నా వినాయకుడిలో గర్వమనేది ఎప్పుడూ ఎక్కడా కనిపించదు. విద్య ... విజ్ఞానం ... వివేకం ... వినయం ఇవన్నీ కూడా మనకి వినాయకుడిలో కనిపిస్తాయి. ఇక ఆయన అంటే జగజ్జనని అయిన పార్వతీ దేవికి పంచప్రాణాలు. అలాంటి గణేశుడి కరుణను అర్థం చేసుకోలేక ఆయన పై పరశురాముడు దాడి చేసి ... ఆ తరువాత పశ్చాత్తాప పడ్డాడు.
ఒకసారి శంకరుడిని దర్శించడానికి పరశురాముడు కైలాసానికి చేరుకున్నాడు. తన తండ్రి ధ్యానంలో ఉన్నాడనీ ... లోపలికి వెళ్లడానికి సమయముందని చెప్పాడు వినాయకుడు. అది అవమానంగా భావించిన పరశురాముడు గణపతిపై దాడికి ప్రయత్నించాడు. అయితే ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా, గతంలో పరశురాముడు శత్రు సంహారం పేరుతో చేసిన పాపాలను తొలగించాలని వినాయకుడు నిర్ణయించుకున్నాడు. కైలాసం నుంచి కదలకుండానే తన తొండంతో చుట్టి పరశురాముడుకి విష్ణు లోకాన్ని సైతం దర్శింపజేసి సప్త సముద్రాలలో ముంచి తీసుకొచ్చాడు.
తనకి గర్వభంగం కలిగించడానికే వినాయకుడు ఆ విధంగా చేశాడని భావించిన పరశురాముడు, గణపతి పైకి పరశువును ప్రయోగించాడు. తన తండ్రి పరశురాముడికి స్వయంగా ఇచ్చిన ఆ ఆయుధాన్ని వినాయకుడు నిలువరించకుండా వినయంగా గౌరవించాడు. అయితే పరశువు ధాటికి ఆయన 'ఎడమ దంతం' విరిగిపోయింది. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగినది తెలిసి బాధపడింది. వినాయకుడి ఉద్దేశాన్ని ఆయనకి వివరించింది. దాంతో తన తొందరపాటును మన్నించమంటూ పరశురాముడు పశ్చాత్తాప పడ్డాడు.