చదలవాడ
భారతదేశంలోని చాలా పుణ్య క్షేత్రాలు రామాయణ ... మహాభారత ఘట్టాలకు వేదికలుగా కనిపిస్తూ వుంటాయి. ఆ కాలంనాటి మహర్షులు ... మహా పురుషులు ఆరాధించిన దైవాలను దర్శించడం ... ఇతిహాసాలలోని ప్రధాన ఘట్టాలు జరిగిన ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడటం మాటలకందని అనుభూతిని అందిస్తూ వుంటుంది. అలాంటి పుణ్య క్షేత్రాల జాబితాలో 'చదలవాడ' క్షేత్రం కూడా కనిపిస్తుంది.
ఈ క్షేత్రం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడుకి సమీపంలో వెలసింది. ఇక్కడ శ్రీ రామచంద్రుడు ... రఘునాయక స్వామిగా పూజలు అందుకుంటూ ఉంటాడు. సీతను రావణాసురుడు అపహరించుకు పోయినప్పుడు ఆమె కోసం రామలక్ష్మణులు వెదకడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే వారికి హనుమంతుని ద్వారా సుగ్రీవుడితో మైత్రి ఏర్పడుతుంది.
శ్రీ రాముడికి ప్రతి సాయంగా సుగ్రీవుడు తన సేనతో సీతను వెదకడానికి బయలుదేరుతాడు. అలా బయలుదేరిన వానర సైన్యం ఈ ప్రదేశంలోనే నాలుగు జట్లుగా విడిపోయి ... నాలుగు దిశలకు వెళ్ళడం జరిగింది. ఈ కారణంగానే ఈ ప్రాంతానికి 'చతుర్వాడ' అనే పేరు వచ్చిందనీ, కాలక్రమంలో 'చదలవాడ' గా మారిందని చెబుతారు. హనుమంతుడు తన దూతయనే నమ్మిక సీతకు కలగడం కోసం ఆయనకి శ్రీ రాముడు తన ఉంగరాన్ని ఇచ్చింది ఇక్కడేనని అంటారు.
ప్రతియేటా ఇక్కడ 'శ్రీరామనవమి' ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ప్రతి యేడు స్వామివారి కళ్యాణ సమయంలో ఓ గరుడ పక్షి ఈ ప్రదేశంలోని ఆకాశ మార్గాన ప్రదక్షిణ క్రమంలో తిరుగుతూ వుంటుంది. విస్మయులను చేసే ఈ దృశ్యం దైవం పట్ల మరింత విశ్వాసాన్ని కలిగిస్తుంది ... ఆధ్యాత్మిక మార్గాన మరో అడుగు ముందుకు వేయడానికి అవసరమైన శక్తిని ప్రసాదిస్తుంది.