మావుళ్లమ్మ

మావుళ్లమ్మ
బిడ్డలను పోషించడంలోను ... వాళ్లని సరక్షించడంలోను తల్లి ప్రధాన పాత్ర వహిస్తుంది. తల్లి నీడలో గల పిల్లలకి ఎలాంటి చింతా వుండదు. తల్లి తమకి తోడుగా ఉందనే భరోసా వాళ్లకి భయమనేది లేకుండా చేస్తుంది. జగజ్జనని అయిన అమ్మవారు తన భక్తులను బిడ్డలుగా భావించి వాళ్లకి అండదండగా నిలుస్తూ వుంటుంది. ఇందుకోసం ఆమె వివిధ పేర్లతో అనేక అవతారాలను ధరించింది. అలాంటి వాటిలో ఒకటి 'మావుళ్లమ్మ'.

మహిమాన్వితమైనదిగా చెప్పుకునే ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా 'భీమవరం'లో విలసిల్లుతోంది. ఆ చుట్టుపక్కల ఊళ్లలోని ప్రజలంతా ఆమెను అమ్మగా భావించడం వలన ఆ తల్లికి 'మావుళ్లమ్మ' అనే పేరు వచ్చినట్టుగా చెబుతుంటారు. క్రీ శ.12 వ శతాబ్దంలోనే ఈ తల్లి ఇక్కడ ఆవిర్భవించిందని అంటారు. భీమవరానికి చెందిన ఇద్దరు భక్తులకు అమ్మవారు కలలో కనిపించి, తన ప్రతిమ ఫలానా చోటున ఉందనీ, దానిని బయటికి తీసి ప్రతిష్ఠించమని చెప్పింది.

ఆ భక్తులిద్దరూ అక్షరాలా అమ్మవారు చెప్పినది అంకిత భావంతో చేశారు. ప్రతి ఏడాది జ్యేష్ట శుద్ధ పాడ్యమి నుంచి నెలరోజులపాటు అమ్మవారి జాతర నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ అదే పద్ధతి ఇక్కడ కొనసాగుతుంది. పై రెండు కుటుంబాల వారు అమ్మవారికి పుట్టింటి వారిగా ... అత్తింటి వారిగా వ్యవహరిస్తూ, ఉత్సవాలు ... ఊరేగింపులు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ వేడుకను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.

More Bhakti Articles