తిరునల్లారు

తిరునల్లారు
సాధారణంగా 'శని దేవుడు' అనే పేరు వినగానే ఎలాంటి వారికైనా మనసులో ఒకరకమైన ఆందోళన మొదలవుతుంటుంది. చాలా మంది నవగ్రహాల దగ్గరకి రావడానికి కూడా భయపడుతుంటారు. అయితే దూరంగా వున్నా ... దగ్గరగా వున్నా ఆయన బారి నుంచి తప్పించుకోవడం మాత్రం సాధ్యం కాదు. ఈ విషయాన్ని గ్రహించిన వారు ఆయనను శాంతింపజేస్తూ అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తుంటారు.

శనేశ్వరుడి దేవాలయం పుదుచ్చేరిలోని తిరునల్లారులో దర్శనమిస్తుంది. ఇక్కడి స్వామివారు 'దర్భారణేశ్వరుడు' గా పిలవబడుతున్నాడు. స్వామివారిని దర్శించే సమయంలో భక్తులు దర్భలను ముడి వేస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన శనిదోషాలు నివారించబడతాయని భావిస్తారు. ప్రమిదలలో దీపాలు వెలిగించి స్వామివారి ముందుంచుతారు. అమ్మవారిని 'భోగామృత పొన్ మొళియాశ్' అని పిలుస్తూ వుంటారు.

ఇక్కడి స్వామివారికి నిత్యాభిషేకాలు జరుగుతూ వుంటాయి. ఇక ప్రతి రెండున్నర సంవత్సరాలకు 'శని పెయెర్చి' ఉత్సవాన్ని నిర్వహిస్తుంటారు. నలమహారాజు ఇక్కడే శని దేవుడి అనుగ్రహాన్ని సంపాదించాడని స్థల పురాణం చెబుతోంది. ఈ కారణంగానే ఇక్కడ నలదమయంతుల విగ్రహాలతో పాటు, 'నలతీర్థం' ... 'నల కూపం' కనిపిస్తూ వుంటాయి. వీటిని దర్శించడం వలన దోషనివారణ జరిగినట్టుగా భక్తులు విశ్వసిస్తుంటారు.

More Bhakti Articles