హంపి
అనంతమైన ఆధ్యాత్మిక సంపదను ... చెరిగిపోని చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న పుణ్య క్షేత్రం హంపి. కర్ణాటక - హోస్పేటకు సమీపంలో విరూపాక్ష స్వామి స్వయం భువుగా వెలిశాడు. విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర రాయలు - బుక్కరాయలు ఈ స్వామిని తమ కులదైవంగా భావించి ఆరాధించినట్టు చరిత్ర చెబుతోంది. 12 వ శతాబ్దంలోనే ఈ క్షేత్రం వున్నతమైన స్థానంలో ఉన్నట్లుగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. 'పంపానది'ని పార్వతీదేవిగా భావించడం వలన, అప్పట్లో ఇక్కడి స్వామి 'పంపాపతి'గా పిలవబడినట్టు ఆధారాలు వున్నాయి.
క్రీ.శ.1565 లో తళ్లికోట యుద్ధంలో అళియ రామరాయలు మరణించడంతో, ఇక్కడి ఆలయాలపై మతపరమైన దాడులు జరిగాయి. అయితే మతేతరులు విరూపాక్ష ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా, వేలాది పందులు సైన్యం పైకి దూసుకు రావడంతో వాళ్లు పారిపోయినట్టు చరిత్ర చెబుతోంది. విరూపాక్ష స్వామి ఆలయాన్ని ఆయన క్షేత్రాలకు పాలకుడిగా వ్యవహరించే విష్ణుమూర్తి 'వరాహావతారం'లో రక్షించినట్టు విజయనగర రాజులు భావించారు.
రామాయణంలో ప్రస్తావించబడిన 'ఋష్యమూక' పర్వతం ... 'మాల్యవంత' పర్వతం ఈ ప్రదేశం లోనివే. ఈ ఆలయ అభివృద్ధిలో విజయనగర రాజులు ప్రధాన పాత్రను పోషించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన విశేషాలను పరిశీలిస్తే వారికి గల అంకిత భావం గురించి తెలుస్తుంది.
ఉగాది ... దసరా .. మహా శివరాత్రి పర్వదినాల్లో స్వామివారికి ఘనంగా ఉత్సవాలు జరుపుతారు. ఇక వైశాఖ మాసంలో జరిగే కళ్యాణోత్సవంలో విరూపాక్షుడిని పెద్ద రథంలో ... చిన్న రథంలో చంద్రమౌళీశ్వర స్వామిని ఊరేగిస్తారు. వేయి జన్మల పుణ్యం వెంటేసుకు వచ్చిన వారికే ఈ రథోత్సవం చూసే భాగ్యం లభిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.