పుష్పగిరి
పరమ పవిత్రమైన 'పుష్పగిరి' క్షేత్రం కడపజిల్లా రాజంపేట సమీపాన 'పెన్నానదీ' తీరంలో భక్తుల పాలిట కొంగుబంగారమై అలరారుతోంది. శివ కేశవులకు భేదం లేదని చాటిచెబుతోన్న ఇక్కడి చెన్నకేశవ స్వామి ఆలయం భక్తిభావ పరిమళాలను వెదజల్లుతూ వుంటుంది. ఆలయ నిర్మాణ నైపుణ్యం ... శిల్పకళా వైభవం ఆశ్చర్యచకితులను చేస్తుంటాయి.
అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రంలో ఒకప్పుడు మహిమాన్వితమైనటువంటి సరస్సు ఉండేదట. పూర్వం ఈ సరస్సులో స్నానమాచరించి దైవ దర్శనం చేసుకునే వారు. అయితే గరుత్మంతుడు తన తల్లికి దాస్య విముక్తి కలిగించడం కోసం దేవలోకం నుంచి అమృత భాండం తీసుకు వస్తుండగా, అందులో నుంచి కొన్ని అమృత బిందువులు ఇక్కడి సరస్సులో పడ్డాయట. ఫలితంగా ఈ సరస్సులో స్నానమాచరించిన వారు తిరిగి యవ్వన వంతులు కావడం మొదలుపెట్టారు.
ఈ విధంగా జరిగితే సృష్టి స్థితి లయలలో సమతుల్యం దెబ్బతింటుందని భావించిన శివ కేశవులు ఈ సరస్సును పూడ్చి వేయించాలని నిర్ణయించుకున్నారు. ఆంజనేయుడు ఓ పెద్ద కొండను తెచ్చి ఈ సరస్సులో వేయగా అది పుష్పంలా తేలియాడుతూ ఉండటంతో, శివకేశవులు ఆ కొండపై చెరో కాలుమోపి దానిని లోపలికి తొక్కారు. పుష్పాకారం గల కొండ పైభాగం మాత్రమే కనిపిస్తూ ఉండటంతో ఈ క్షేత్రానికి 'పుష్పగిరి'అనే పేరు వచ్చింది.
ఇప్పుడీ కొండపై కనిపించే పాద ముద్రలు శివకేశవులవేనని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ క్షేత్ర విశిష్టతను గ్రహించిన ఆది శంకరుల వారు ఇక్కడ పీఠాన్ని స్థాపించారు. అది 'పుష్పగిరి పీఠం'గా మహోన్నతమైన స్థానాన్ని అలంకరించింది.