రామతీర్థం
శ్రీ రామచంద్రుడు ... శివుడిని ఎంతగా ఆరాధిస్తాడో, శివుడు అంతగా ఆయనను ప్రేమిస్తాడు. పురాణాలలో సైతం ఈ విషయం స్పష్టంగా కనిపిస్తూ వుంటుంది. రావణాసురుడిని సంహరించడానికి అవసరమైన శక్తి కోసం శివుడి గురించి తపస్సు చేసిన రాముడు, రావణ వధ అనంతరం ఆ పాపం అంటకుండా వుండటం కోసం వివిధ ప్రదేశాల్లో కోటి శివలింగాలను ప్రతిష్ఠించాడు.
ఆ క్రమంలో రాముడు ఈ ప్రదేశంలో నెలకొని ఉన్న సదాశివుడిని దర్శించాడు. ఈ ప్రదేశంలో ఓ కోనేరును తవ్వించి ఆ నీటితో ఇక్కడి శివుడికి అభిషేకం చేశాడు. రాముడు ఇక్కడ కోనేరును తవ్వించిన కారణంగానే ఈ ప్రాంతానికి 'రామతీర్థం' అనే పేరు వచ్చినట్టు స్థల పురాణం చెబుతోంది. రాముడు దర్శించిన నాటినుంచి ఇక్కడి స్వామివారు 'మోక్ష రామలింగేశ్వరుడు' గా పూజలు అందుకుంటున్నాడు.
'రామతీర్థం' గా చెప్పబడుతోన్న ఇక్కడి కోనేరులోని మట్టిని నుదుటిపై పెట్టుకుంటే విభూతి రాసుకున్నట్టుగానే ఉండటం గురించి విశేషంగా చెప్పుకుంటారు. ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకాలో వెలసిన ఈ క్షేత్రం నేటికీ భక్తులను తరింపజేస్తూనే వుంది. శివాలయంలో పార్వతీ అమ్మవారు దక్షనాభిముఖంగా కొలువుదీరగా, ఆ పక్కనే గంగాదేవి కూడా దర్శనమిస్తుంది.
ఈ అమ్మవారి అనుగ్రహాన్ని ఆశిస్తూ భక్తులు ప్రతి యేటా చైత్ర మాసంలో జాతర జరుపుతారు. అయితే ఈ జాతరలో జంతుబలులు కనిపించవు. శివయ్యకి గంగమ్మ అలా మాట ఇవ్వడమే అందుకు కారణమని చెబుతారు. ఇక మోక్ష రామలింగేశ్వరుడికి కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. మహా శివరాత్రి రోజున శివపార్వతులకు కల్యాణోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది.