యాదగిరి గుట్ట
నృసింహ అవతారంలో హిరణ్య కశిపుడిని సంహరించిన శ్రీమన్నారాయణుడు ... తన భక్తుడైన ప్రహ్లాదుడు భయపడుతూ వుంటే ఓ తల్లిలా చెంతకు తీసుకున్నాడు. ప్రహ్లాదుడి ప్రార్ధన మేరకే శాంతించి అనేక అంశలతో వివిధ ప్రదేశాల్లో గుట్టలపైనా ... గుహల్లోనూ వెలిశాడు. తనని కొలిచే భక్తుల పాలిట కొంగుబంగారమై అనుగ్రహిస్తున్నాడు. అలా నృసింహ స్వామి కొలువుదీరిన ప్రదేశమే 'యాదగిరి గుట్ట' ... ఇది నల్గొండ జిల్లా పరిధిలోకి వస్తుంది.
చాలా పుణ్య క్షేత్రాల మాదిరిగానే ఇది కూడా భక్తుడి పేరుతో ప్రసిద్ధి చెందిందే. పూర్వం యాదవ మహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేయగా శ్రీమన్నారాయణుడు ... జ్వాలా ... యోగానంద ... గండభేరుండ నృసింహ స్వామిగా దర్శనమిచ్చాడట. భూలోక వాసుల కోసం అవే అంశలతో అక్కడ కొలువుదీరమని యాదవ మహర్షి కోరడంతో, భక్తవత్సలుడైన స్వామి అలాగే అక్కడ వెలిశాడు.
స్వామివారికి అవసరమైన నీటి కోసం ఇక్కడ యాదవ మహర్షి కోనేరును తవ్వాడు. ఇప్పటికీ ఈ కోనేరులోని నీటినే స్వామివారి సేవలకు వినియోగిస్తుంటారు. ఇక్కడి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా భక్తులు తప్పనిసరిగా దర్శించుకుంటూ వుంటారు. గర్భాలయంలో లక్ష్మీ నృసింహుల ఉత్సవ మూర్తులు కళ కళలాడుతూ కనిపిస్తాయి.
సహజంగానే నృసింహ స్వామికి దుష్ట శక్తులు దూరంగా వుంటాయి. ఈ స్వామి భక్తుల పై నుంచి వచ్చే గాలి కూడా తమకి తాక కుండా అవి జాగ్రత్త పడుతుంటాయి. అందువలన దుష్ట గ్రహాలచే పీడించబడుతున్నవారు ... అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఈ క్షేత్రానికి ఎక్కువగా వస్తుంటారు ... ఆ స్వామి అనుగ్రహంతో కోలుకుని తిరిగి వెళుతుంటారు. విశేషమైనటు వంటి పర్వదినాల్లో ఈ క్షేత్రంలో ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు ఘనంగా జరుగుతూ వుంటాయి.