నైమిశారణ్యం
భూలోకంలో పరమ పవిత్రమైనదిగా సాక్షాత్తు బ్రహ్మ దేవుడే పేర్కొనబడిన ప్రదేశం 'నైమిశారణ్యం'.108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం, ఉత్తరప్రదేశ్ - లక్నోలోని సీతాపూర్ సమీపంలో గోమతీ నదీ తీరాన విలసిల్లుతోంది. పూర్వం రుషి గణాలు బ్రహ్మ దేవుడి దగ్గరికి వెళ్లి తాము తపస్సు చేసుకోవడానికి తగిన పవిత్రమైన ప్రదేశం ఎక్కడ ఉన్నదో చెప్పమని కోరారు. దాంతో బ్రహ్మ తన మనోమయ చక్రాన్ని వదిలి పెట్టాడు. ఆ చక్రం ఎక్కడైతే పడుతుందో, దానిని మించిన పవిత్ర ప్రదేశం మరెక్కడా లేనట్టేనని చెప్పాడు. ఆ వెంటనే మహర్షులంతా ఆ చక్రాన్ని అనుసరించడం మొదలు పెట్టారు.
అలా లోకాలన్నీ తిరిగిన ఆ చక్రం భూలోకంలోని ఓ అరణ్య ప్రాంతానికి వచ్చింది. అక్కడ ఆ చక్రం చుట్టూ వుండే అంచు (నేమి) పడిపోయింది. నేమి పడిన అరణ్య ప్రదేశం కనుక 'నైమిశారణ్యం'గా పిలవబడుతోంది. మహర్షుల కోరిక మేరకు ఇక్కడ లలితాదేవి కొలువుదీరింది. ఈ ప్రదేశంలో చేసిన స్నాన ... దానాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
శ్రీ రాముడు అశ్వమేధ యాగం చేసినదీ ... లవకుశులను కలుసుకున్నది ఇక్కడే. సీతాదేవి పేరున శ్రీరాముడు బ్రాహ్మణులకు దానం చేసిన గ్రామమే నేటి 'సీతాపురం' అని అంటారు. శుక్రాచార్యుల వారి ద్వారా ఈ క్షేత్ర పవిత్రత గురించి తెలుసుకున్న ప్రహ్లాదుడు, ఇక్కడి తీర్థాలను దర్శించినట్టు చెబుతారు. ఇక శౌనకాది మహర్షులకు సూతమహాముని మహాభారత కథను తొలిసారిగా వినిపించినది ఇక్కడే.
విష్ణుమూర్తి సుదర్శన చక్రం ద్వారా ఏర్పడిన చక్రతీర్థంలో స్నానం చేసిన తరువాత ముందుగా ఇక్కడి వినాయకుడిని దర్శించుకోవాలి. ఆ తరువాత 'లింగ ధారిణి' పేరుతో అనుగ్రహించే లలితాదేవిని దర్శించాలి. అదే వరుసలో పంచ ప్రయాగలను దర్శించి 'జానకీ కుండ్' దగ్గరికి చేరుకోవాలి. సీతాదేవి తన తల్లి భూదేవి ఒడిలోకి చేరింది ఇక్కడేనని అంటారు. ఆ తరువాత శివుడు - కేశవుడు కొలువుదీరిన ప్రదేశాలు ... వ్యాసగద్దె మనసుపై మరిచిపోలేని ముద్ర వేస్తాయి.