కాశీ
సప్త మోక్షపురాలులో గంగానదీ తీరంలో వెలసిన కాశీకి విశిష్టమైన స్థానం వుంది. పూర్వం కష్యా అనే రాజు పరిపాలించిన కారణంగా ఈ ప్రాంతానికి కాశీ అనే పేరు వచ్చినదని చెబుతుంటారు. ఇది వారణి - అసి అనే రెండు నదుల సంగమ ప్రదేశం కావడం వలన వారణాసి అని కూడా పిలుస్తుంటారు. ఈ క్షేత్రానికి పాలకుడుగా కాలభైరవుడు వ్యవహరిస్తుంటాడు. పరమ పవిత్రమైన ఈ క్షేత్రం ఎన్నోసార్లు మతపరమైన దాడులను ఎదుర్కుంది. మరెందరో పుణ్య మూర్తులు ఈ క్షేత్ర పవిత్రతను కాపాడుతూ వచ్చారు. ప్రస్తుతం వున్న ఆలయాన్ని రాణీ అహల్యా దేవి నిర్మించిందనడానికి ఆధారాలు వున్నాయి
ఇక ఇక్కడ జ్యోతిర్లింగ ఆవిర్భవానికి దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే ... విశ్వసృష్టి కోసం శ్రీమన్నారాయణుడు ఓ పవిత్రమైన ప్రదేశంలో తపస్సు చేయాలనుకున్నాడు. అప్పుడు శివుడు కాశీ నగరాన్ని సృష్టించి ఆయనకి ఇచ్చాడు. ఈ సమయంలో శ్రీహరి చెవిపోగు పడిపోయిన ప్రదేశమే నేడు 'మణికర్ణిక' ఘట్టంగా పిలవబడుతూ భక్తులను తరింపజేస్తోంది. శ్రీహరి కోరిక మేరకు శివుడు జ్యోతిర్లింగ స్వరూపుడై ఇక్కడ విశ్వేశ్వరుడిగా వెలిశాడు. ఈ క్షేత్ర మహాత్మ్యం గురించిన ప్రస్తావన మనకి పురాణాల్లో కనిపిస్తుంది.
గర్భాలయంలోని ఈ శివలింగానికి భక్తులు స్వయంగా అభిషేకాలు చేయవచ్చు. ఇక్కడి అమ్మవారు విశాలాక్షిగా అశేష భక్త జనకోటిని అనుగ్రహిస్తూ వుంటుంది. అమ్మవారికి సంబంధించి త్రిశక్తి పీఠాలలో ఒకటిగా ... అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ఈ క్షేత్రం అలరారుతోంది. ఈ కారణంగానే ఎందరో మహనీయులు మోక్ష సిద్ధికి కాశీని ఆశ్రయించారు. మరెందరో పుణ్య పురుషులు తమ ఆధ్యాత్మిక చింతనకు కాశీని వేదికగా చేసుకున్నారు.
కాశీ చేరుకొని గంగలో స్నానమాచరిస్తే పాపాలు హరించబడతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి దశాశ్వమేధ ఘట్టం .. హరిశ్చంద్ర ఘట్టం .. మణికర్ణిక ఘట్టం .. కేదార ఘట్టం .. పంచగంగా ఘట్టంలో స్నానమాచరిస్తూ భక్తులు పునీతులవుతుంటారు.